good news: మాజీ సీఎం ఫుల్ హ్యాపీ, అదే జరిగితే పక్క రాష్ట్రంలో కేసీఆర్ కు ?, దేవుడు వరం అందిస్తే !

మాజీ సీఎంకు మరోసారి సుడి తిరుగుతుందని వేదపండితులు అంటున్నారు. అన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆ మాజీ సీఎం చాలా సన్నిహితుడు. మాజీ సీఎం అనుకున్నది జరిగితే ఢిల్లీలో,

బెంగళూరు/ గోకర్ణ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించి ప్రజలకు అనేక వరాలు కురిపించి వెళ్లారు. అంతకు ముందు యువరాజు రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటక మీదుగా వెళ్లింది. ఇక మిగిలింది మాజీ ప్రధాని ఫ్యామిలీ, చాలా సంవత్సరాలు కర్ణాటకలో కింగ్ మేకర్స్ గా ఉన్న మాజీ ప్రధాని ఫ్యామిలీ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మాజీ ప్రధాని కుమారుడు, మాజీ సీఎం ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లడానికి పంచరత్న యాత్ర చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎంతో ప్రసిద్ది చెందిన ఆలయంలో మాజీ సీఎం పూజలు చేస్తున్న సమయంలో వరసిద్ది వినాయకుడి విగ్రహంలోని కుడి చెవిలో పెట్టిన పువ్వు కిందకు పడింది.

మాజీ సీఎంకు మరోసారి సుడి తిరుగుతుందని వేదపండితులు అంటున్నారు. అన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆ మాజీ సీఎం చాలా సన్నిహితుడు. మాజీ సీఎం అనుకున్నది జరిగితే ఢిల్లీలో, పక్క రాష్ట్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని మాజీ సీఎం సన్నిహితులు అంటున్నారు. అసలు ఏం జరిగిందో అని ఒకసారి చూద్దాం.

కింగ్ మేకర్ అంటే కింగ్ మేకర్ అంతే

కింగ్ మేకర్ అంటే కింగ్ మేకర్ అంతే

భారత మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు హెచ్ డీ. కుమారస్వామికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కుమారస్వామి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే విషయం జేడీఎస్ పార్టీ నాయకులకే తెలీదు. కర్ణాటకలో కింగ్ మేకర్ గా మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు హెచ్ డీ. కుమారస్వామి పేరు తెచ్చుకున్నారు. కుమారస్వామి స్కెచ్ వేస్తే అటా ఇటూ తేడా ఉన్నా ఆయన మాత్రం టార్గెట్ మాత్రం కచ్చితంగా చేరుకుంటున్నారు.

కుమారస్వామి పుణ్యమే బీజేపీకి అధికారం

కుమారస్వామి పుణ్యమే బీజేపీకి అధికారం

దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మొట్ట మొదటి రాష్ట్రం కర్ణాటక. కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశంలో పాగా వేసింది. ఆ సమయంలో ఎం. వెంకయ్యనాయుడు చొరవ ఎక్కువగా తీసుకున్నారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుమారస్వామి ఆయన పదవి కాలం పూర్తి అయిన తరువాత బీజేపీకి సీఎం సీటు అప్పగించినట్లు అప్పగించి వెంటనే సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేశారు.

మరోసారి సీఎం అయిన కుమారస్వామి

మరోసారి సీఎం అయిన కుమారస్వామి

ఐదు సంవత్సరాల క్రితం కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ కు సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోయారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామిని సీఎం చేసి ఉప ముఖ్యమంత్రి పదవిలో కాంగ్రెస్ నాయకులను కుర్చుబెట్టింది. బీఎస్ యడియూరప్ప ఆపరేషన్ కమల పేరుతో ఎంట్రీ ఇవ్వడంతో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇలా పట్టుమని 50 మంది ఎమ్మెల్యేలు చేతిలో లేని సమయంలో కుమారస్వామి రెండు సార్లు సీఎం కావడం ఆయనకు మాత్రమే సాధ్యం అని నిరూపించుకున్నారు.

చరిత్ర రిపీట్ అవుతుందా ?

చరిత్ర రిపీట్ అవుతుందా ?

బీజేపీ, కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా రెండు సార్లు ఉన్న కుమారస్వామి ఇప్పుడు రెండు పార్టీలతో తెగతెంపులు చేసుకుని ఏక్ నిరంజన్ అంటూ రంగంలోకి దిగారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున ప్రచారం చెయ్యడానికి హెచ్ డీ. కుమారస్వామి పంచరత్న యాత్ర చేస్తూ కర్ణాటక మొత్తం తిరుగుతున్నారు. ఇదే సమయంలో కుమారస్వామికి వేదపడింతులు గుడ్ న్యూస్ చెప్పారు.

చాలా ఫేమస్ గుడి

చాలా ఫేమస్ గుడి

కర్ణాటకోని ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణాలో పంచరత్న యాత్ర చేస్తున్న కుమారస్వామి అక్కడ ప్రసిద్ది చెందిన మహాగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేస్తున్న సమయంలో వినాయకుడి కుడి చెవిలో ఉన్న పువ్వు దానంతట అదే కిందపడింది. పూజలు చేసే వారు ఏదైనా కోరికలు బలంగా కోరుకుంటా దేవుడు ఇలా కుడి చెవిలోని పువ్వు వరం ఇస్తాడని, కుమారస్వామికి అంత మంచి జరగుతుందని వేదపండితులు ఉంటున్నారు.

అదే జరిగితే కర్ణాటకలో కేసీఆర్ కు ?

అదే జరిగితే కర్ణాటకలో కేసీఆర్ కు ?

త్వరలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ రాకపోతే మళ్లీ కుమారస్వామి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి, ఇప్పటికే కొన్ని సర్వేలు కుమారస్వామి కింగ్ మేకర్ అని చెప్పాయి. ఇదే జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చాలా సన్నిహితుడు కావడం, బీఆర్ ఎస్ పార్టీకి ఇప్పటికే మద్దతు తెలపడంతో కేసీఆర్ కు కర్ణాటకలో మంచి అవకాశం చిక్కినట్లు అవుతుంది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అనుకున్నది జరిగితే ఢిల్లీలో, కర్ణాటకలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని మాజీ సీఎం కుమారస్వామి సన్నిహితులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+