ఫేమస్ మాల్ కామాంధుడికి బెయిల్ మంజూరు, వీడి టైమ్ బాగుంది, నేరుగా వెళ్లి !

బెంగళూరు: బెంగళూరులోని ఫేమస్ షాపింగ్ మాల్‌లో ఒకటైన లులు మాల్‌లో నాలుగు రోజుల క్రితం యువతి వీపును తాకి ఆమెను లైంగికంగా వేధించిన వ్యక్తి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. రిటైడ్ హెడ్ మాస్టర్ అయిన నిందితుడు పోలీసులకు చిక్కకుండా నేరుగా కోర్టులో హాజరయ్యాడు. కోర్టుకు హాజరై బెయిల్ పొందిన నిందితుడు నేరుగా అతని ఇంటికి వెళ్లిపోయాడు.

అక్టోబరు 29వ తేదీ ఆదివారం సాయంత్రం బెంగళూరులోని బసవేశ్వరనగర్ లో నివాసం ఉంటున్న రిటైడ్ హెడ్ మాస్టర్ అశ్వత్థనారాయణ( 62) లులు మాల్ కు వెళ్లి అక్కడ ఓ యువతిని తాకుతూ ఆమె శరీరంలోని ఇతర భాగాల్లో చేతులు వేసి ఆమెను శారీరకంగా వేధించాడు. వీడియో తీసిన ఓ యువకుడు లులు మాల్ మేనేజర్‌కి సమాచారం అందించి అతడి కోసం వెతికారు. అయితే అక్కడ అందరి నుంచి తప్పించుకున్న అశ్వథ్ నారాయణ పారిపోయాడు.

The retired head master who molested the young woman in the mall took bail in the court

బహిరంగ ప్రదేశంలో యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తికి దేహశుద్ది చెయ్యడానికి మాల్ సిబ్బంది కొంతసే వెతికారు. ఆ యువకుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఆ వీడియో వైరల్‌గా మారి చివరికి పోలీసుల చేతికి చేరింది. వీడియోను పరిశీలించిన బెంగళూరులోని మాగడి రోడ్ స్టేషన్ పోలీసులు లులు మాల్‌ను తనిఖీ చేసి రెండు రోజుల తర్వాత వ్యక్తి ఆచూకి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు.

అయితే అశ్వత్ నారాయణ ఇంటికి తాళం వేసి పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. లాయర్‌తో కలిసి కోర్టుకు హాజరైన అశ్వథ్ నారాయణ బెయిల్‌ పొందాడు. పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో తల దాచుకున్న అశ్వత్థనారాయణ గురువారం మధ్యాహ్నం తన లాయర్‌తో కలిసి బెంగళూరులోని ఏసీఎంఎం 2 న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. అనంతరం బెయిల్‌ దరఖాస్తును కోర్టులో విచారించిన న్యాయమూర్తి అశ్వత్ నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ తీసుకున్న అశ్వత్ నారాయణ తరువాత అతని ఇంటికి వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+