మాజీ గర్ల్ ఫ్రెండ్ వెంటపడ్డాడు, రాత్రి ఫోన్ చేసి పిలిపించి ?, గుర్తు పట్టకుండా చెక్కేశారు !

ప్రేమించుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఆమెను మరిచిపోయి మౌనంగా ఉండాలి. పెళ్లయిన తర్వాత కూడా మాజీ గర్ల్ ఫ్రెండ్ ఏమవుతుందో చెప్పడానికి ఇదిగో ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రేమించిన అమ్మాయి ఆమె భర్తతో కాపురం చేస్తుంటే ఆమె వెంటపడిన యువకుడు దారుణ హత్యకు గురైనాడు. నెల లోపు పెళ్లి చేసుకోవలసిన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు శవమైనాడు.

హత్యకు గురైన ప్రేమికుడి పేరు అరుణ్( 24). వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన అరుణ్ గతంలో ప్రేమలో పడ్డాడు. ఇంతకాలం ఆ జంట ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలకు, పార్కులకు, సినిమాలకు, షికార్లకు తిరిగారు. అయితే ఇంతకాలం ప్రియుడు అరుణ్ తో రొమాన్స్ చేసిన అతని ప్రియురాలు నీకు నేను దూరంగా ఉంటాను అని చెప్పింది. ప్రియురాలు వేరొకరితో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

 The rivals called the young man who was at home and called him out and brutally cut him to death with knives

అయితే పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న ప్రియురాలితో మళ్లీ రొమాన్స్ చెయ్యాలని అనుకున్న అరుణ్ ఆమె వెంటపడ్డాడు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే నాతో కూడా నువ్వు కాపురం చెయ్యాలని అతని మాజీ ప్రియురాలితో అరుణ్ గొడవకు దిగాడని తెలిసింది. అయితే భర్తతో కాపురం చేస్తున్న మాజీ ప్రియురాలు అరుణ్ తో కలిసి తిరగడానికి అంగీకరించలేదని సమాచారం.

శుక్రవారం రాత్రి 10.30 గంటలకు బెంగళూరులోని మైసూరు రోడ్డులోని టింబర్ యార్డ్‌లో నివాసం ఉంటున్న అరుణ్ ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. రాత్రి మద్యం సేవించిన తరువాత ఇంటికి వెళ్లిన అరుణ్ భోజనం చేసి నిద్రపోవడానికి అతని రూమ్ లోకి వెళ్లాడు. ఇంతలో ఓ స్నేహితుడు ఫోన్ చేసి బయటకు రావాలని అరుణ్ ను పిలిచాడు. ఫ్రెండ్ పిలుస్తున్నాడని అరుణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

తరువాత శ్రీనగర్ రోడ్డులోని బేకరీ ముందు అరుణ్, అతని స్నేహితుడు నిలబడి ఉన్నారు. అక్కడికి బైక్‌పై వచ్చిన నలుగురైదుగురు దుండగులు కత్తులు తీసుకుని అరుణ్ మీద విరుచుకుపడ్డారు. ఆ సమయంలో అరుణ్ వెంట ఉన్న అతని స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు అరుణ్ తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్లు అరుణ్ ను దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో కిందపడిన అరుణ్ తుదిశ్వాస విడిచాడు.

 The rivals called the young man who was at home and called him out and brutally cut him to death with knives

దుండగులు 20కి పైగా కత్తులతో పొడిచి అరుణ్ ను చంపారు. అరుణ్ ముఖం గుర్తు పట్టలేని విధంగా అతని ముఖం పూర్తిగా కత్తులతో చెక్కేశారని పోలీసులు అన్నారు. అయితే స్నేహితుడే ఉద్దేశపూర్వకంగా ఇంట్లో ఉన్న అరుణ్ ను బయటకు పిలుచుకుని వచ్చాడా ? అనే అనుమానం కూడా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటరాయణపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

ప్రేమించిన అమ్మాయి భర్త అరుణ్ ను హత్య చేసి ఉంటాడు ? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన అరుణ్‌కు పెళ్లి నిశ్చయమైంది, జనవరి నెలలో అరుణ్ వివాహం జరగాల్సి ఉంది. అయితే అరుణ్ ను అంత దారుణంగా ఎందుకు చంపారు? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మాజీ ప్రియురాలి వ్యవహారంలోనే అరుణ్ హత్యకు గురైనాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+