గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడని కాలేజ్ అబ్బాయి చేతివేళ్లు కట్, బండరాళ్లతో పచ్చడి చేసి ?
న్యూఢిల్లీ: కాలేజ్ లో చేరిన వెంటనే అమ్మాయిలు, అబ్బాయిలను పరిచయం చేసుకుని వారితో కలిసి మెలసి తిరుగుతుంటారు. కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి బాగా చదువుకోవడమే కాకుండా వారితో హ్యాపీగా విహారయాత్రలు, సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కాలేజ్ అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందని, ప్రాణాలు కూడాపోయే అవకాశం ఉందని చాలా సందర్బాల్లో వెలుగు చూసింది.
కాలేజ్ లో అమ్మాయిని ఓ అబ్బాయి పరిచయం చేసుకున్నాడు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కాలేజ్ పూర్తి అయిన తరువాత బయట తిరుగుతున్నారు. సాయంత్రం ఎవరిపాటికి వాళ్లు ఇంటికి వెళ్లిపోతున్నారు. చాలా కాలంగా కాలేజ్ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ తో అతని బయట తిరుగుతూ సినిమాలు, షికార్లకు తిరుగుతోందని తెలిసింది.

అక్టోబర్ 21వ తేదీన కాలేజ్ అబ్బాయి ఇంటికి వెళ్లాడు. కాలేజ్ అబ్బాయి చేతివేళ్లు పూర్తిగా తెగిపోవడంతో అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఏం జరిగింది అని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా బైక్ యాక్సిడెంట్ అయ్యిందని, చేతివేళ్లు తెగిపోయాయని కాలేజ్ అబ్బాయి అతని తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే కాలేజ్ అబ్బాయిని ఆసుపత్రిలో చేర్పించారు.
అప్పటి నుంచి ఆ అబ్బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 20 రోజుల తరువాత శుక్రవారం కాలేజ్ అమ్మాయి ఆమె ఫ్రెండ్ ను చూడటానికి అతని ఇంటికి వెళ్లి బోరునవిలపించింది. ఏం జరిగింది అంటూ కాలేజ్ అబ్బాయి తల్లి ఆ యువతిని ప్రశ్నించింది. తనతో మీ కొడుకు తిరుగుతున్నాడని కోపంతో మా కాలేజ్ లో చదువుతున్న ఓ అబ్బాయి మీ కొడుకు చేతి వేళ్ల మీద బండరాళ్లు ఎత్తివేసి పచ్చడి చేశాడని చెప్పింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న కాలేజ్ అబ్బాయి కుటుంబ సభ్యులు హడలిపోయారు.
వెంటనే కాలేజ్ అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజ్ అబ్బాయి చేతివేళ్లు పోవడానికి కారణం అయిన అదే కాలేజ్ అబ్బాయి పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాలేజ్ అమ్మాయితో తిరుగున్నాడని కోపంతో ఆమె స్నేహితుడి చేతివేళ్లు రాళ్లతో కత్తిరించిన ఘటన కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయి, కాలేజ్ అబ్బాయి ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో మిగిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications