• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏమిటీ విపరీతం: ఆ సంస్థలకు పొంచి ఉన్న ముప్పు

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోని కొన్ని ముఖ్యమైన ప్రజాతంత్ర, ప్రజాస్వామిక సంస్థల పవిత్రత, వాటికి ఉన్న గౌరవం ప్రమాదంలో పడుతున్నది. ఇది తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై విమర్శలు రావడానికి నేపథ్యంగా మారింది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు, పార్టీలు ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నించడం ఆనవాయితీగా మారుతోంది. గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఇటీవల వెల్లడైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఫలితాల వరకూ వర్తిస్తోంది.

ప్రత్యేకించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీఎస్పీ, తర్వాత కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)తోపాటు చివరకు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ సారథ్యంలోని త్రుణమూల్ కాంగ్రెస్ సైతం పోలింగ్‌లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల్లో ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలకు దిగాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన బీజేపీ కూడా 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇదే ఆరోపణలు చేయడం ఆసక్తికర పరిణామమే మరి.

న్యాయవ్యవస్థ పనితీరు ఇలా

న్యాయవ్యవస్థ పనితీరు ఇలా

స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రతిష్ఠాత్మక ఎన్నికల సంఘం మొదలు న్యాయవ్యవస్థ వరకు కీలక వ్యవస్థలన్నీవిమర్శలు ప్రతి విమర్శలకు గురవుతున్నాయి. దశాబ్దాల క్రితం భారత పాలకులు రూపొందించిన ప్రవర్తనా నియమావళి అద్భుతంగా పని చేస్తూ వచ్చింది. నిష్పక్షపాతంగా, వివక్షా రహితంగా సామాన్యుడి ప్రయోజనాల పరిరక్షణకు పలు పద్ధతులను అమలులోకి తెచ్చారు. కానీ వివిధ పార్టీల అధినేతలు, నాయకులు పరాజయం పాలైనప్పుడు ప్రతిష్ఠకు పోయి విమర్శలు చేయడం ఆనవాయితీగా మారుతున్నది.

రాజకీయ నాయకులకు తప్పనిపరిస్థితులు ఇలా

రాజకీయ నాయకులకు తప్పనిపరిస్థితులు ఇలా

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అధికార బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వంటి వారిపై సుప్రీంకోర్టు జడ్జి అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించడం ఊహించడం తేలికే. కొందరు రాజకీయ నాయకులకు తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తుందని అర్థం చేసుకోవడమే సులువే మరి. అందుకే ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు సాకులు వెతుక్కోవడం సహజ పరిణామమేనని అంటున్నారు. కానీ బాధ్యతారాహిత్య ప్రకటనలో మరిన్ని తలనొప్పులు తెచ్చుకోవడం రాజకీయ నాయకులకు సాధారణ పరిణామంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. సామాన్యుడిని తప్పుదోవ పట్టించేందుకు ఉపకరిస్తాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది.

సుప్రీం, ఈసీల పనితీరు ఇలా

సుప్రీం, ఈసీల పనితీరు ఇలా

కానీ ఇటువంటి ఆరోపణలేమీ కూడా ప్రభుత్వ, న్యాయ వ్యవస్థలపై ఎటువంటి ప్రభావం చూపలేదని అంటున్నారు. రాజ్యాంగ బద్ధంగా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకునే ఈ సంస్థలపై ఎటువంటి దుష్ప్రభావం ఉండదన్న అభిప్రాయం ఉంది. గమ్మత్తేమిటంటే 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పరాజితులైన పార్టీలు బహిరంగ వేదికపై ‘ఈవీఎంలను ట్యాంపరింగ్' జరుగుతుందని ఆరోపణల పర్వం సాగించారు. కానీ ఏ ప్రముఖ వ్యక్తులు కూడా ఎన్నికల సంఘాన్ని సవాల్ చేసే స్థాయికి వెళ్లకపోవడం గమనార్హం. ఒకవేళ ఎవరైనా ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి తన ఆరోపణలను నిరూపించాలని ప్రయత్నిస్తే ప్రజాకోర్టులో శిక్షించబడతామన్న భయం ఇప్పటికీ రాజకీయ పార్టీల నేతల్లో కొనసాగుతున్నది.

ఆరోపణలతో అప్రమత్తమైన ఈసీ ఇలా

ఆరోపణలతో అప్రమత్తమైన ఈసీ ఇలా

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. కానీ ఈ స్థానానికి పోలింగ్ జరిగిన ప్రాంతంలో ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని ఆరోపణలు వచ్చాయి. భింద్‌లో స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని జర్నలిస్టులు కూడా కోరారు. ఈ ఘటన తర్వాత ఎన్నికల సంఘం ఒక గుణపాఠం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నదా? అని అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. 100 శాతం ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలకు పూనుకున్నారు. మరోవైపు ఓటర్ వెరిఫైడ్ ప్రింటింగ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) యంత్రాల వాడకం ద్వారా ఎన్నికల ప్రక్రియకు మరింత పారదర్శకత శోభ అందించాలని సంకల్పించింది. ప్రతి వీవీపాట్ యంత్రం చొప్పున మొత్తం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు రూ.3,174 కోట్లు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తదనుగుణంగా ఈసీఐఎల్, బీఈఎల్‌లను సదరు యంత్రాలు తెలియజేయాలని కోరింది.

వీవీపాట్ యంత్రాల వినియోగం దిశగా అడుగులు

వీవీపాట్ యంత్రాల వినియోగం దిశగా అడుగులు

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఈవీఎంలకు వీవీపాట్ యంత్రాలను ఏర్పాటు చేసి, ఫలితాలు వచ్చిన తర్వాత విశ్లేషించుకుంటే ఉపయోగకరంగా ఉండేదన్న అభిప్రాయం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో స్వీయ ప్రకటిత విమర్శలు చేస్తున్న వారు ఒక్క సంగతి విస్మరించొద్దన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తద్వారా ఆరోపణల క్షిపణుల ప్రయోగాన్ని నియంత్రించుకోవాలని కోరుతున్నారు. విస్త్రుత స్థాయి చర్చల సరళితో ప్రజాతంత్ర, ప్రజాస్వామ్య సంస్థల గౌరవాన్ని పెంచాలని అభిప్రాయ పడుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The respect and sanctity of some of our most important democratic institutions have been threatened. The latest incident relates to India’s Election Commission. A few people who lost elections owing to their obsolete politics have begun to raise a clamour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more