300 మంది అమ్మాయిలపై లైంగిక దాడి: మాజీ మంత్రి కుమారుడు అరెస్టు, ఉద్యోగం ఇప్పిస్తారా!

బెంగళూరు: ఇంటర్వూలకు వచ్చే యువతులకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి వారి మీద లైంగిక దాడి చేస్తున్న మాజీ మంత్రి కుమారుడిని బెంగళూరులోని మైకో లేఔట్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి అబ్దుల్ గని మాలీక్ కుమారుడు హబీబ్ గని (26) అనే యువకుడిని అరెస్టు చేశారు.

జమ్మూ కాశ్మీర్ సాంఘిక సంక్షేమ శాఖా మాజీ మంత్రి అబ్దుల్ గని మాలీక్ కుమారుడు హబీబ్ ఉన్నత విద్యాభ్యాసం చెయ్యడానికి బెంగళూరు చేరుకుని ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇతను బెంగళూరులోని జేపీ నగర్ లోని పుట్టేనహళ్ళిలోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. ఇతడు చెడు అలవాట్లకు భానిస అయ్యాడని సమాచారం. హబీబ్ గని చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు.

అమ్మాయిల పిచ్చిపట్టింది !

అమ్మాయిల పిచ్చిపట్టింది !

మాజీ మంత్రి కుమారుడు హబీబ్ గనికి అమ్మాయిల పిచ్చి ఉందని తెలిసింది. పలు కంపెనీలకు ఇంటర్వూలకు వెలుతున్న హబీబ్ అక్కడి అమ్మాయిల మీద కన్నువేశాడు. అంతే కాకుండా తనతో పాటు ఇంటర్వూలకు వస్తున్న అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నాడు.

అమ్మాయిల ఫోన్ నెంబర్లు, వివరాలు !

అమ్మాయిల ఫోన్ నెంబర్లు, వివరాలు !

పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఇంటర్వూలకు వెళ్లే యువతులు రిసెప్షన్ లో వారి పేర్లు, వివరాలు రాస్తుంటారు. ఆ వివరాలు ఉన్న బుక్ చూస్తున్న హబీబ్ తన మొబైల్ లో ఫోన్ నెంబర్లు, వివరాలను ఫోటో తీసుకుంటున్నాడు. తరువాత ఇంటికి వచ్చి అమ్మాయిల ఫోన్ నెంబర్లు లిస్ట్ ఔట్ చేస్తున్నాడు.

ఉద్యోగం ఇప్పిస్తా రా !

ఉద్యోగం ఇప్పిస్తా రా !

ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిలకు హబీబ్ గని ఫోన్ చేస్తున్నాడు. తనకు అనేక కంపెనీలలో హెచ్ఆర్ మేనజర్లు పరిచయం ఉన్నారని, తాను చెబితే కచ్చితంగా ఉద్యోగం ఇస్తారని వారిని నమ్మిస్తున్నాడు. అలా అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఫ్లాట్ కు పిలిపించుకుని లైంగిక దాడి !

ఫ్లాట్ కు పిలిపించుకుని లైంగిక దాడి !

అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న హబీబ్ గని తన అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ కు అమ్మాయిలను పిలిపించుకుని లైంగిక దాడి చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిల మీద వ్యామోహంతో హబీబ్ గని ఇలా రెచ్చిపోతున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు 300 మంది అమ్మాయిల మీద ఇతను లైంగిక దాడి చేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్వూకు వెళ్లి !

ఇంటర్వూకు వెళ్లి !

కర్ణాటకలోని ఉడపికి చెందిన 22 ఏళ్ల యువతి బీకాం పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నది. మే 15వ తేదీన బన్నేరుఘట్ట రోడ్డులోని బీజీ రోడ్డులోని హెచ్ ఎస్ డీసీ (HSDC) సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంటర్వూకు వెళ్లింది. అక్కడే ఆమెను హబీబ్ గని పరిచయం చేసుకున్నాడు.

నాకు హెచ్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ !

నాకు హెచ్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ !

హెచ్ ఎస్ డీసీ సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్ ఆర్ మేనేజర్ తనకు చాల క్లోజ్ ఫ్రెండ్, నేను చేబితో నీకు కచ్చితంగా ఉద్యోగం ఇస్తారని ఉడిపి యువతిని నమ్మించాడు. నీవు నా ఫ్లాట్ కు ఓ సారి రావాలని ఆమెను బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది.

నడి రోడ్డులోనే లైంగిక దాడి !

నడి రోడ్డులోనే లైంగిక దాడి !

అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ కు రావడానికి నిరాకరించిన ఉడిపి యువతి మీద కంపెనీ ముందు భాగంలో నడిరోడ్డు మీద ఆమెపై లైంగిక దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆమె శరీరంలోని ప్రైవేట్ భాగాలు పట్టుకుని నీచంగా ప్రవర్తించాడని, బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో హబీబ్ గని మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. ఇతను చాల మంది అమ్మాయిలను ఇలాగే వేధించాడని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని మైకో లేఔట్ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+