కుంబకర్ణుడు, తండ్రి ఆలస్యంగా నిద్రలేపాడని కొడుకు ఏం చేశాడంటే ?, వీడు మనిషేనా!
తిరువనంతపురం/కేరళ: వయసుకు వచ్చిన కొడుకు ఇంట్లో ఉంటే మమ్మల్ని పోషిస్తాడని తల్లిదండ్రులకు ఓ ధైర్యం అని బావిస్తారని పెద్దలు అంటుంటారు. అయితే చేతికి వచ్చిన కొడుకు చెడుతిరుగుడు తిరుగుతుంటే ఏం చెయ్యాలో తెలీక తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటారు. అలాంటి కొడుకు చేతిలో చిన్న విషయానికి ఓ తండ్రి దారుణ హత్యకు గురైనాడు.
కేరళలో ఓ చిన్న విషయానికి జరిగిన గొడవ హత్యలో ముగిసింది. కేరళలో త్రిసూర్‌లోని కొడనూర్ ప్రాంతంలో జాయ్ (60) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. జాయ్ కి రీనా అనే భార్య, అలీనా అనే కుమార్తె, 25 ఏళ్ల వయసు ఉన్న రిజో అనే కుమారుడు ఉన్నాడు. భార్య రీనాతో పాటు కొడుకు, కూతురితో కలిసి జాయ్ కొన్ని సంవత్సరాల వరకు సంతోషంగానే జీవించాడు.

జాయ్ కుమారుడు రిజో స్థానికంగా ఉన్న ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నాడు. రిజో మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. పగలు, రాత్రి ఎప్పుడంటే అప్పుడు మద్యం సేవిస్తున్న రిజో మద్యం మత్తులో ఇంటికి వెళ్లి నిద్రపోతున్నాడు. మద్యాహ్నం మద్యం సేవించిన రిజో ఇంటికి వెళ్లాడు. రాత్రి 8.15 గంటలకు తనను నిద్ర లేపాలని రిజో అతని తండ్రి జాయ్ కి చెప్పి రూమ్ లో నిద్రపోయాడు.
అయితే రిజో తండ్రి జాయ్ పనిలో పడి కొడును నిద్రలేపడం మరిచిపోయాడు. రాత్రి 8.30 గంటలకు జాయ్ కు అతని కొడుకు రిజోను నిద్రలేపాలని గుర్తుకు వచ్చింది. కేవలం 15 నిమిషాలు ఆలస్యంగా జాయ్ అతని కొడుకు రిజోను నిద్రలేపాడు. నిద్రలేచి టైమ్ చూసిన రిజో 15 నిమిషాలు ఆలస్యం అయ్యింది, ఫ్రెండ్స్ మందు పార్టీ మొదలై ఉంటుందని కోపంతో అతని తండ్రి జాయ్ తో గొడవపెట్టుకున్నాడు.
కోపోద్రిక్తుడైన రిజో నన్ను ఎందుకు ఆలస్యంగా నిద్ర లేపావని అతని తండ్రి జాయ్ తో వాగ్వాదానికి దిగాడు. అదికాస్తా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణగా మారడంతో సహనం కోల్పోయిన రిజో అతని తండ్రి జాయ్ ని ఇనుప రాడ్ తో కొట్టి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రిజోను అదుపులోకి తీసుకున్నారు. జాయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేలం 15 నిమిషాలకు ఆలస్యంగా నిద్రలేపినందుకు తండ్రి జాయ్ ని అతని కొడుకు రిజో కొట్టి చంపిన ఘటన కేరళలో కలకలం రేపింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications