డీకేశీని సీఎం చెయ్యాలని నిర్మలానంద స్వామీజీ, ఒక్కలిగ సంఘాల బ్యాటింగ్, సిద్దూ !
బెంగళూరు: కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు అనే విషయంలో ఉత్కంఠ నెలకొనింది. సిద్దరామయ్యను సీఎం చెయ్యాలని ఆయన వర్గంలోని సీనియర్ ఎమ్మెల్యేలు బెంగళూరులో రహస్య సమావేశం నిర్వహించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలని బెంగళూరులో ఒక్కలిగులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ చేశారు.
బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీకి చెందిన హెబ్బాళ ఎమ్మెల్యే భైరతి సురేష్ కు చెందిన అపార్ట్ మెంట్ లో సిద్దరామయ్య వర్గం ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సిద్దరామయ్యను సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి చెయ్యాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సిద్దరామయ్య వర్గం నాయకులు గాలం వేస్తున్నారు.

ఇదే సమయంలో బెంగళూరులో ఒక్కలిగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒక్కలిగుల స్వామీజీ శ్రీశ్రీశ్రీ నిర్మలానంద స్వామీజీతో పాటు ఒక్కలిగ మాలకు చెందిన స్వామీజీలు కూడా ఈ సమవేశానికి హాజరైనారు. పార్టీ ఏదైనా సరే ఒక్కలిగ కులానికి చెందిన డీకే. శివకుమార్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలని ఒక్కలిగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
డీకే. శివకుమార్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని, కేపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావడనికి శక్తి వంచనలేకుండా పని చేశారని పలువురు ఒక్కలిగ సంఘం నాయకులు చెప్పారు. డీకే. శివకుమార్ ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన నాయకుడు అని, ఆయన్ను సీఎం చెయ్యాలని ఒక్కలిగ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో హెచ్ డీ. దేవేగౌడకు, హెచ్ డీ. కుమారస్వామికి ఒక్కలిగులు అందరూ సహకరించారని, ఇప్పుడు అలాగే డీకే. శివకుమార్ కు ఒక్కలిగులు అందరూ మద్దతు ఇవ్వాలని, ఆయన్ను సీఎం చెయ్యడానికి అందరూ కలిసి పని చెయ్యాలని శ్రీశ్రీశ్రీ నిర్మలానంద స్వామిజీ ఒక్కలిగ సంఘం నాయకులకు మనవి చేశారు.

కొందరు నాయకులు డీకే. శివకుమార్ కు చాలా టార్చర్ పెట్టారని, డీకేశీ అన్ని ఓర్చుకుని ప్రత్యర్థులతో పోరాటం చేశారని, మరో నాయకుడు అయితే ఇలా పోరాటం చెయ్యలేడని, అసలు భూమి మీదనే ఉండేవాడు కాదని ఒక్కలిగ సంఘం నాయకులు గుర్తు చేశారు. ఇక్కడ పార్టీలతో పనిలేదు, మన కులం నాయకుడు డీకే. శివకుమార్ ను సీఎం చెయ్యడానికి మనం అందరూ కలిసి పని చెయ్యాలని ఒక్కలిగ కులానికి చెందిన స్వామీజీలు, ఒక్కలిగ సంఘం నాయకులు ఎకగ్రీవ తీర్మానం చేశారు.
డీకే. శివకుమార్ ను సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి చెయ్యాలని ఒక్కలిగ సంఘం నాయకులు డిసైడ్ అయ్యారు. అయితే ఇదే సమావేశంలో తాము మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకం కాదని, మేము మా కులం నాయకుడి కోసం పని చేస్తున్నామని చెప్పారు. కేపీసీసీ అధ్యక్షుడే సీఎం కావాలని కాంగ్రెస్ పార్టీలో ఓ సిద్దంతం ఉందని, అందువలన డీకే శివకుమార్ ను సీఎం చెయ్యాలని ఒక్కలిగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు












Click it and Unblock the Notifications