Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దావూద్ ఇబ్రహీం మేనకోడలి పెళ్లిలో మహారాష్ట్ర పోలీసులు, నాయకుల చిందులు !

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అతి సమీప బంధువుల పెళ్లికి హాజరై సందడి చేసిన మహారాష్ట్ర పోలీసు అధికారులను విచారించడానికి నాసిక్ సిటీ పోలీసు కమిషనర్ సిద్దం అయ్యారు.

నాసిక్(మహారాష్ట్ర): అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అతి సమీప బంధువుల పెళ్లికి హాజరై సందడి చేసిన మహారాష్ట్ర పోలీసు అధికారులను విచారించడానికి నాసిక్ సిటీ పోలీసు కమిషనర్ సిద్దం అయ్యారు. దేశద్రోహి కుటుంబ సభ్యుల పెళ్లికి హాజరైన పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల జాబితాను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.

మే 22వ తేదీ సోమవారం మహారాష్ట్రలోని నాసిక్ లో దావూద్ ఇబ్రహీం సోదరుడి మేనకోడలి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు అనేక మంది పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు హాజరైనారని మహారాష్ట్రలోని మీడియా కథనాలు ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

The wedding of Dawood's niece and son of a former corporator in Nashik.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడి మేనకోడలి పెళ్లికి పోలీసు అధికారులు హాజరైనారా ? లేదా ? అనే విషయంపై విచారణ మొదలుపెట్టామని నాసిక్ సిటీ పోలీసు కమిషనర్ రవీంద్ర సింఘాల్ మీడియాకు చెప్పారు. నాసిక్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కుమారుడితో దావూద్ ఇబ్రహీం సోదరుడి మేనకోడలు వివాహం జరిగింది.

దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యుల పెళ్లికి పోలీసు అధికారులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరైనారని స్థానిక మీడియ వార్తలు ప్రసారం చేసింది. దావూద్ ఇబ్రహీం మేనకోడలి పెళ్లికి ఎంత మంది పోలీసు అధికారులు హాజరైనారు, శుభకార్యానికి హజరైన రాజకీయ నాయకులు ఎవరు ? అనే నిజానిజాలు బయటకు లాగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+