దోసెల వేసే పాన్ తో భర్తను కొట్టి చంపేసిన భార్య, ఇంట్లో ఎన్ని మారణాయుధాలు ?
చెన్నై/తిరుప్పూర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. రోజు మద్యం సేవిస్తున్న భర్త ఇంటికి వెలుతున్నాడు. ఇంటికి వెళ్లిన భర్తను దోసెలు వేసే పాన్ తో కొట్టి చంపేసిన భార్య భలే నాటకాలు ఆడింది.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని ఈరోడ్ సమీపంలోని సెంథిల్ నగర్ లో రవికుమార్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జ్యోతిమణి అలియాస్ జ్యోతి (36) అనే మహిళను రవికుమార్ వివాహం చేసుకున్నాడు. భార్య జ్యోతితో పాటు పిల్లలతో కలిసి రవికుమార్ చాలా సంతోషంగా జీవించేవాడు.
మద్యంకు బానిస అయిన రవికుమార్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మార్చి 22వ తేదీన రవికుమార్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య జ్యోతిని కొట్టడం ప్రారంభించాడు. నేను ఇంటిలో లేని సమయంలో నువ్వు ఎవ్వరితో తిరుగుతున్నావు అంటూ రెచ్చిపోయిన రవికుమార్ అతని భార్య జ్యోతిని చితకబాదేశాడు.

ఆ సమయంలో భర్త రవికుమార్ వేధింపులు తట్టుకోలేని జ్యోతి వంటగదిలోకి పారిపోయింది. అక్కడికి వెళ్లిన రవికుమార్ భార్య జ్యోతిని చితకబాదేశాడు. సహనం కోల్పోయిన జ్యోతి దోసలు వేసే పాన్ తీసుకుని ఆమె భర్త రవికుమార్ తలపై దాడి చేసి అతని శరీరం మీద అనేక చోట్ల కొట్టింది. ఈ సమయంలో రవికుమార్ స్పృహ తప్పి వంటగది పక్కన పడిపోయి తరువాత పైకి లేవలేదు.
తరువాత జ్యోతి అంబులెన్స్ పిలిపించి ఆమె భర్త రవికుమార్ ను తీసుకెళ్లి ఈరోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. తరువాత తన భర్త గుండెపోటు వచ్చి చనిపోయాడని ఊరు అందరికి, బంధువులకు చెప్పి నమ్మించింది. రవికుమార్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొడుకు మృతిపై రవికుమార్ తండ్రి అనుమానం వచ్చి తిరుమురుగన్‌పూండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అనంతరం రవికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదికలో గట్టి వస్తువుతో రవికుమార్ మీద దాడి చేశారని, శరీరంపై గాయాలు ఉన్నాయని తేలింది. అనంతరం అతని భార్య జ్యోతిని పోలీసులు విచారించగా తన భర్త రవికుమార్‌ను హత్య చేసినట్లు అంగీకరించింది. రోజు తాగి వచ్చి కొడుతున్నాడని, ఓపిక నశించింది దోసెలు వేసే పాన్ తో కొట్టి హత్య చేశానని జ్యోతి అంగీకరించింది పోలీసులు అన్నారు. జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించామని పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications