Wife: రాత్రి ఇంటికి వెళ్లి భార్యను చెప్పుతో కొట్టిన భర్త, పెళ్లామ్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, ఫినిష్ !
దంపతుల మధ్య చాలాకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను చెప్పుతో కొట్టాడు.
గుహవాటి/అసోం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. డ్రైవర్ అయిన భర్త ప్రతిరోజు రాత్రి మద్యం సేవించి ఇంటికి వెలుతున్నాడు. మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నానో అనే వియం భర్త మరిచిపోతున్నాడని సమాచారం. దంపతుల మధ్య చాలాకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను చెప్పుతో కొట్టాడు. ఆ సమయంలో జరిగిన గొడవ కారణంగా భర్త హత్యకు గురైనాడు.

భార్యను చెప్పుతో కొట్టాడు
అసోంలోని సిల్చార్‌లో ఓ మహిళ ఆమె భర్తను కత్తిరితో పొడిచి చంపింది. మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను చెప్పుతో కొట్టాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన భార్య కత్తెరతో ఆమె భర్తను పొడిచి చంపిందని పోలీసులు తెలిపారు. మరణించిన ఆమె భర్త ఫెర్మిన్ ఉద్దీన్ ఆటో డ్రైవర్ అని పోలీసులు అన్నారు. దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ భార్య సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చికిత్స చేయించామని పోలీసులు అన్నారు.

ఆటో డ్రైవర్ భార్య అరెస్టు
ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత ఆటో డ్రైవర్ ఫెర్మిన్ భార్యను పోలీసులు అరెస్ట్ చేశారని కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నుమల్ మహట్టా మీడియాకు చెప్పారు. ఆటో డ్రైవర్ ఫెర్మిన్ శరీరంలోని పలు భాగాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేసిన కొన్ని గంటల్లో అతను మరణించాడని పోలీసులు తెలిపారు.

భార్య ఏం చెప్పిందంటే ?
పోలీసుల విచారణలో తన భర్తను నేనే హత్య చేశానని భార్య తనతప్పు ఒప్పుకుందని పోలీసులు అన్నారు. నా భర్త ఫెర్మిన్ ప్రతిరోజూ నన్ను హింసించేవాడు. ఇది తట్టుకోలేక కోపంతో కత్తెరతో పొడిచాను అని భార్య పోలీసులకు చెప్పింది. మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి శబ్దం చేస్తూ చెంపపై చెప్పుతో కొట్టాడని, నాకు కోపం వచ్చి నన్ను నేను రక్షించుకోవడానికి కత్తెరతో అతన్ని పొడిచానని భార్య పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే నిజానిజాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు. ఫెర్మిన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వీళ్లు మెహర్‌పూర్‌లోని కబియురా ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారని, వీరి ఇంట్లో ప్రతిరోజు రాత్రి గొడవలు జరిగేవని ఇరుగుపొరుగు వారు తెలిపారని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications