Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేప్ వీడియోలతో బ్లాక్ మెయిల్, పదేపదే రేప్ చేస్తున్నాడని గొంతు కోసి చంపేసిన లేడీ!

న్యూఢిల్లీ/ చెన్నై: రేప్ వీడియోలతో బెదిరింపులు చేస్తూ పదేపదే మహిళ మీద అత్యాచారం చేశాడు. బాధిత మహిళ బతకలేక చావలేని పరిస్థితి ఎదురైయ్యింది. నువ్వు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇతరులు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చూసే విధానం మారుతుందని బాధిత మహిళలను బెదిరించాడు. ఇలా రేప్ వీడియో చూపించి బెదిరించి మళ్లీ మళ్లీ మహిళ మీద అత్యాచారం చేశాడు.

దీంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ ఎట్టకేలకు గట్టి నిర్ణయం తీసుకుని పదునైన కత్తిని తన వద్ద ఉంచుకుంది. మరో సారి అత్యాచారానికి యత్నించగా ఆ కత్తితో ఇంతకాలం రేప్ చేస్తున్న వ్యక్తి గొంతు కోసింది. తీవ్ర రక్తస్రావంతో ఆ కామాంధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన బాధిత మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

The woman who killed the young man who was raping with blackmail with rape videos in Delhi

ఈ ఘటన ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో చోటుచేసుకుంది. శాస్త్రి ప్రాంతానికి చెందిన ఓ మహిళపై అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల అబుజార్ అత్యాచారం చేశాడు. అంతకుముందు పరిచయస్తుడైన ఈ యువకుడు భారీ ప్లాన్ వేసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ మీద అత్యాచారం చేసే సమయంలో సీక్రేట్ గా వీడియోలు తీశాడు. ఈ వీడియో ద్వారా మళ్లీ మళ్లీ బెదిరించి ఆమె మీద అబుజార్ అత్యాచారం చేశాడు.

కామాంధుడైన అబుజార్ ను శిక్షించాలని పథకం వేసిన మహిళ ఓ వ్యక్తి సాయం కోరింది. బాధితురాలు ఆమె ప్రియుడు ఇర్ఫాన్‌ను సహాయం కోరింది. కామాంధుడు అబుజార్ బాధిత మహిళను నిర్జన ప్రదేశానికి రావాలని, తన కోరిక తీర్చాలని చెప్పాడు. నువ్వు రాకపోతే నీ రేప్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తానని ఆమెను అబుజార్ బెదిరించాడు.

అదే పిలుపు కోసం ఎదురు చూస్తున్న మహిళ కత్తితో పాటు అబుజార్ చెప్పిన నిర్జనప్రదేశంలోకి వెళ్లిపోయింది. అలాగే తన స్నేహితుడు ఇర్ఫాన్‌ను కూడా అదే ప్రాంతానికి రావాల్సిందిగా బాధితురాలు కోరింది. మొదట బాధిత మహిళ నిర్జనప్రదేశంలోకి వెళ్లిన తరువాత కొంత దూరంలోకి ఆమె ప్రియుడు ఇర్ఫాన్ వెళ్లాడు.

The woman who killed the young man who was raping with blackmail with rape videos in Delhi

నిందితుడు మరోసారి బాధిత మహిళ మీద అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె కత్తితో అబుజార్ గొంతుకోసి హత్య చేసింది. ఇంతలో అక్కడికి వెళ్లిన ఇర్ఫాన్ బాధిత మహిళకు సహాయం చేసి అబుజార్ ప్రాణాలతో తప్పించుకోకుండా చేశాడు. అబుజార్ ను హత్య చేసి ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అబుజార్ ఫోన్‌ కాల్స్‌పై అనుమానం వచ్చింది.

పోలీసులు మహిళను పట్టుకుని ఆమెను విచారించారు. తనపై అత్యాచారం చేసినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకే అతడిని తాను హత్య చేశానని విచారణలో ఆ మహిళ చెప్పిందని, ఆమెను అరెస్టు చేసి ఇర్ఫాన్ కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పదేపదే అత్యాచారం చేస్తున్న యువకుడిని ఓ మహిళ గొంతు కోసి చంపేయడం ఢిల్లీలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+