ATM machine: పెళ్లి డేట్ ఫిక్స్, గ్రాండ్ గా చెయ్యాలని, పెళ్లి కథ దేవుడు ఎరుగు, బెయిల్ కథ !

చెన్నై/కన్యాకుమారి: ఓ యువకుడు ఉద్యోగం చెయ్యడానికి ఊరువదిలి వెళ్లాడు. ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి సెట్ అయ్యింది. పెళ్లి డేట్ ఫిక్స్ చేసి పెద్దలు నువ్వు పెళ్లికి వారం రోజులు ముందు రావాలని, పెళ్లి ఖర్చులకు డబ్బులు కూడా తీసుకురావాలని ఆ యువకుడికి కుటుంబ సభ్యులు చెప్పారు. అక్కడే అసలు కథ మొదలైయ్యింది. పెళ్లికి ఏటీఎం యంత్రానికి సంబంధించి ఓ మంచి కథ తెర మీదకు వచ్చింది.

 ఏటీఎం యంత్రం పగిలిపోయింది

ఏటీఎం యంత్రం పగిలిపోయింది

తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన అను (28) అనే యువకుడు పుదుచ్చేరి చేరుకుని అక్కడి నెల్లితోపు ప్రాంతంలోని రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పుదుచ్చేరిలోని నెల్లితోప్పు ప్రాంతంలో లెనిన్ రోడ్‌లో ఏటీఎం మిషన్‌ పగిలిపోయింది. ఏటీఎం మిషన్ పగిలిపోయిందని గుర్తించిన బ్యాంకు అధికారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ఆ ​​ఏటీఎం సెంటర్ సమీపంలోని బిర్యానీ రెస్టారెంట్ లో పని చేస్తున్న కన్యాకుమారి జిల్లాకు చెందిన అనుపై అనుమానం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 అనుకు పెళ్లి ఫిక్స్ అయ్యింది

అనుకు పెళ్లి ఫిక్స్ అయ్యింది

పోలీసులు కేసు విచారణ ముమ్మరం చేశారు. పుదుచ్చేరి బస్ స్టేషన్ నుంచి కన్యాకుమారి వెళ్లేందుకు వేచి ఉన్న అనును పోలీసులు అదుపులోకి తీసుకెళ్లి విచారించారు. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులు తనకు పెళ్లి జరిపించాలని డేట్ ఫిక్స్ చేశారని, అవసరమైన డబ్బుతో ఊరికి రావాలని చాలా రోజుల క్రితమే తనకు చెప్పారని అను పోలీసులకు చెప్పాడు. అయితే పలువురి వద్ద అప్పులు చెయ్యడానికి ప్రయత్నించానని, ఎవ్వరూ డబ్బులు ఇవ్వడానికి ముందుకురాలేదని అను పోలీసులకు చెప్పాడు.

 పెళ్లి ఖర్చుల కోసం

పెళ్లి ఖర్చుల కోసం

డబ్బులు రావడానికి ఎలాంటి అవకాశం రాకపోవడంతో తాను రోజు నిద్రపోయి రెస్టారెంట్ ప్రాంతానికి సమీపంలోని ఏటీఎం కేంద్రంలో చోరీకి పథకం వేసినట్లు అను ఒప్పుకున్నాడని పోలీసులు అన్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అర్ధరాత్రి ఇనుప కడ్డీలను కత్తిరించే కటింగ్ మిషన్‌తో ఏటీఎం మిషన్‌ను పగులగొట్టానని అను పోలీసులకు చెప్పాడు. మిషన్ పగిలిపోయినా డబ్బు ఉన్న బాక్స్ బద్దలు కొట్టలేక పోయానని, దొంగతనానికి ప్రయత్నించి ఫలితం లేకపోవడంతో చిక్కిపోతానని భయపడి ఊరికి పారిపోయేందుకు తాను ప్రయత్నించినట్లు అను అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

 పెళ్లి కథ దేవుడు ఎరుగు. బెయిల్ కథ చూడండి

పెళ్లి కథ దేవుడు ఎరుగు. బెయిల్ కథ చూడండి

అనంతరం అనును అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి ఏటీఎం కార్డు, ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టేందుకు ఉపయోగించిన కటింగ్ మిషన్, ఇనుప కడ్డీలను స్వాధీనం చేసుకుని అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించామని పోలీసులు అన్నారు. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్న యువకుడు ఏటీఎం యంత్రం దెబ్బకు జైలుపాలైనాడు. పెళ్లి కథ దేవుడు ఎరుగు ఇప్పుడు అనుకు బెయిల్ కథ చూద్దామని అతని కుటుంబ సభ్యులు సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+