వదినతో వన్స్ మోర్, మరిది మోజులో పడి ఎంతపని చేసిందంటే ?, కూతుర్లకు పెళ్లి చేసి ఆంటీ చేసిన పనికి ?
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త తమ్ముడికి వివాహం అయ్యింది. అన్న, అతని భార్య, పిల్లలు కలిసి కాపురం ఉంటున్నారు తమ్ముడు అతని భార్య, పిల్లలు మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఒకే ఊరిలో నివాసం ఉంటున్న అన్నదమ్ముల కుటుంబ సభ్యులు ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతున్నారు. ఇదే సందర్బంలో అక్రమ సంబంధం కారణంగా తమ్ముడిని అతని అన్న హత్య చేశాడు.
కర్ణాటకలోని హావేరి తాలుకాలోని నల్లోగల్ల తాండాలో శంకరప్ప (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శంకరప్పకు ఇంతకు ముందే సరిత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో వివాహం అయ్యింది. శంకరప్ప, సరిత దంపతులకు పిల్లలు ఉన్నారు. సరిత, శంకరప్ప దంపతుల ఇద్దరు కుమార్తెలకు ఇప్పటికే వివాహం అయ్యింది. సరిత కుమార్తెలు హావేరిలో వారి భర్తలతో కలిసి నివాసం ఉంటున్నారు.

శంకరప్పకు హనుమంతు (43) అనే తమ్ముడు ఉన్నాడు, హనుమంతకు వివాహం అయ్యింది. భార్య, పిల్లలతో కలిసి నల్లోగల్ల తాండాలోనే హనుమంతు వేరుగా నివాసం ఉంటున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి అన్న శంకరప్ప భార్య సరితో సన్నిహితంగా ఉంటున్న హనుమంతు ఆమెతో కలిసి బయట తిరుగుతన్నాడని తెలిసింది. తరువాత వదిన సరితతో హనుమంతు అక్రమ సంబందం పెట్టుకున్నాడని సమాచారం.
మరిది హనుమంతుతో అక్రమ సంబందం పెట్టుకున్న సరిత అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. మరిది మోజులో జల్సా చేస్తున్న సరిత ఆమె భర్త శంకరప్పను నిర్లక్షం చేస్తూ వచ్చింది. కొన్ని నెలల క్రితం భార్య అక్రమ సంబంధం గురించి శంకరప్పకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలని, బందువుల్లో పరువు పోతుందని శంకరప్ప అతని భార్య సరితకు వార్నింగ్ ఇచ్చాడు.

భర్త శంకరప్ప వార్నింగ్ ఇచ్చినా సరిత మాత్రం పద్దతి మార్చుకోకుండా మరది హనుమంతుతో కలిసి తిరగడం మొదలుపెట్టింది. భార్య మాట వినలేదని శంకరప్ప అతని తమ్ముడు హనుమంతకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే తమ్ముడు కూడా మాట వినలేదని రగిలిపోయిన శంకరప్ప శుక్రవారం రాత్రి కత్తి తీసుకుని అతని తమ్ముడు హనుమంతను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన హనుమంతను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై శనివారం హనుమంతు చనిపోయాడని పోలీసులు అన్నారు. వదిన సరితతో అక్రమ సంబంధం పెట్టుకున్న హనుమంతు అతని అన్న చేతిలోనే హత్యకు గురి కావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications