Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Court: కేసు విచారణ, కోర్టు వెనుక వెంటాడి వెంటాడి నరికేశారు. పాతకక్షలు, లేడీ మ్యాటర్ ?

చెన్నై/కోయంబత్తూరు: కొంతమంది యువకులు చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగారు. యువకులకు యుక్త వయసు వచ్చిన తరువాత చెడు అలవాట్లకు బానిసలు అయ్యారు. చెడు అలవాట్ల తీర్చుకోవడానికి యువకులకు డబ్బు అవసరం అయ్యింది. ఇదే సమయంలో కొంత మంది జైలుకు వెళ్లారు. ఇప్పటికి కొందరు యువకులు కోర్టు వాయిదాలకు తిరుగుతున్నారు. కోర్టు వాయిదాలకు వెళ్లిన ఇద్దరు యువకులను వేటకొడవళ్లు, కత్తులతో దారుణంగా నరికేశారు. జిల్లా కోర్టు వెనుకనే ఇలాంటి సంఘటన జరగడం కలకలం రేపింది.

 స్నేహితుల మీద కేసులు

స్నేహితుల మీద కేసులు

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని కీరానాథం పురంలో గోకుల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శివనంతపురంలో మనోజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గోకుల్, మనోజ్ కు చాలా మంది స్నేహితులు ఉన్నారు మనోజ్, గోకుల్ మీద గంజాయి కేసులు నమోదు కావడంతో ఇద్దరూ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లిన గోకుల్, మనోజ్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పటి వరకు గోకుల్, మనోజ్ కోర్టు వాయిదాలకు తిరుగుతున్నారు. సోమవారం కోయంబత్తూరులోని కోర్టులో కేసు విచారణకు మనోజ్, గోకుల్ హాజరైనారు.

 స్పాట్ లో చంపేశారు

స్పాట్ లో చంపేశారు

అక్కడ కోర్టు వెనుక ఉన్న గోపాలపురంలో గోకుల్, మనోజ్ ఇద్దరూ టీ తాగేందుకు వెళ్లా. అనంతరం వారిని వెంబడిస్తున్న ఐదుగురు వ్యక్తులు కత్తులతో ఇద్దరినీ నరికి పారిపోయింది. గోకుల్ మెడపై వేటకొడవలితో బలంగా నరకడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గోకుల్ తో పాటు ఉన్న మనోజ్ తల, చేయి తదితర బాగాలపై తీవ్రగాయాలు కావడంతో కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రతలించారు.

 జస్ట్ మిస్ అయ్యాడు..... అయితే బతికేది ?

జస్ట్ మిస్ అయ్యాడు..... అయితే బతికేది ?

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోకుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నేరస్తులను పట్టుకునేందుకు కోయంబత్తూరు పోలీస్ కమిషనర్ బాలకృష్ణన్ ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పాతకక్షలు, మహిళ విషయంలో గోకుల్, మనోను చంపేయాలని అతని ప్రత్యర్థులు ప్రయత్నించారని, ఇదే సమయంలో గోకుల్ హత్యకు గురైనాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+