ఉగ్రవాదులపై భారత ఆర్మీ దాడి చేసిన 9 ప్రాంతాలు ఇవే..?

భారతదేశం వ్యాప్తంగా విషాదం నింపిన "జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం"లో చోటు చేసుకున్న ఉగ్రమూకల దాడికి ఆర్మీ బదులు తీర్చుకుంది. బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాకిస్తాన్ తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా.. సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం అందుతోంది.

ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. వారి శిక్షణా శిబిరాలు, కమ్యూనికేషన్ హబ్‌లు, ఆయుధ నిల్వలు తుడిచి పెట్టివేసినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా, కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు ప్రహరించాయి. అత్యంత పక్కా ప్రణాళికతో, ప్రెసిషన్ స్ట్రైక్స్‌తో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.

these-are-the-9-areas-where-the-indian-army-attacked-terrorists

దాడులు జరిపిన తొమ్మిది ప్రాంతాలు ఇవే..

ఇండియన్ ఆర్మీ దాడులు జరిపిన 9 ప్రధాన ఉగ్ర స్థావరాల్లో 4 పాకిస్తాన్‌లో, 5 పీఓకేలో ఉన్నాయి. ఇందులో ముంబై దాడుల సూత్రదారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కంచుకోట మురీడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్‌లో 2 శిబిరాలు, కోట్‌లి, గుల్పూర్, భీమ్బర్, సియాల్‌కోట్, చకంబ్రూ, మురీడ్కే, బహావల్పూర్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఇది కేవలం ప్రతీకార చర్య గానే కాకుండా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత ప్రభుత్వం వేసిన ఒక ముందడుగు అని అభివర్ణిస్తున్నారు.

పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని కాల్చి చంపారు. దీంతో మృతుల భార్యాలకు నుదుట సిందూరాన్ని దూరం చేసిన కారణంగానే ఈ ఆపరేషన్‌కు 'సిందూర్‌' అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడులపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ పేర్కొంది. ఈ దాడులను ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+