Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏటీఎంలో డబ్బులే డబ్బులు, ఏకంగా జేసీబీని ఎత్తుకెళ్లి వీళ్లు ఏం చేశారంటే ?

బెంగళూరు/శివమొగ్గ: దొంగతనాలు చెయ్యడానికి ఇప్పుడు నిందితులు హైటెక్ స్కెచ్ లు వేస్తున్నారు. మారుతున్న టెక్నాలజీని ఉపయోగించిన నిందితులు చోరీలు చేస్తున్నారు. ఇక ఎవ్వరికి చిక్కకుండా చోరీలు ఎలా చెయ్యాలి అంటూ చాలా మంది యూట్యూబ్ ల్లో వెతుకుతున్నారని చాలా సందర్బాల్లో వెలుగు చూసింది. ఇక్కడ ఏటీఎంలో చోరీ చెయ్యడానికి ఓ కేటుగాడు ఏకంగా జేసీబీని ఎత్తుకుని వచ్చాడు

రోడ్డుపక్కన నిలిపిన జేసీబీతో ఏటీఎం మిషన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ దొంగ పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఘటన బుధవారం అర్థరాత్రి కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. శివమొగ్గలోని వినోబా నగర్ ప్రధాన రహదారిలోని శివాలయం సమీపంలోని పెట్రోల్ బంకు పక్కన ఉన్న భవనంలోని యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం సెంటర్‌లో ఈ ఘటన జరిగింది.

thieveswentwithjcbmachinetostealatmmachine

రోడ్డు మరమ్మతుల కారణంగా కొద్దిరోజులుగా పెట్రోలు బంకు సమీపంలో జేసీబీని పార్క్ చేస్తున్నారు. నకిలీ కీని ఉపయోగించిన నిందితులు ఏటీఎం మిషన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు. దొంగలు జేసీబీని స్విచ్ ఆన్ చేసి ఆ భవనాన్ని ధ్వంసం చేశాడు. ఆ సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు పెట్రోలింగ్‌ వాహనం రావడంతో జేసీబీని అక్కడే వదిలేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

దొంగలు జేసీబీ సాయంతో ఏటీఎంను చోరీ చేస్తుండగా భవనం పైభాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటన దృశ్యం సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. సంఘటనా స్థలాన్ని వినోబానగర్ పోలీస్ స్టేషన్ అధికారులు పరిశీలించి నిందితుల ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. మొత్తం మీద జేసీబీతో ఏటీఎం యంత్రం ఎత్తుకు వెళ్లి ఆ మిషన్ లోని డబ్బుతో ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నించిన నిందితుడు ఇప్పుడు మాయం కావడం హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+