కృషి ఉంటే మనుషులు రుషులవుతారు: ఈ గ్రామం 30 మంది ఐఏఎస్ అధికారులను అందించింది
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు... మహా మనుషులవుతారు అనే దానికి ఉదాహరణ ఉత్తర్ ప్రదేశ్‌లోని చిత్రకూట్ మండలంలోని రాయిపురా గ్రామం. ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది కలెక్లర్లు అయ్యారు. మరికొందరు ఐపీఎస్ అధికారులు కాగా ఇంకొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ గ్రామంలో ఏ ఇళ్లును చూసినా ఆ ఇంట్లో వ్యక్తి ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారే కనిపిస్తారు. ఇంతలా ఆ గ్రామస్తులు విజయం సాధించారంటే వారి వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే రిటైర్డ్ ప్రిన్సిపాల్ మహేంద్ర ప్రసాద్ సింగ్.
జలౌన్‌లోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సమయంలో అక్కడి విద్యార్థులకు హిస్టరీలో పాఠాలు బోధించేవాడు మహేంద్ర సింగ్. అలా ఆయన పాఠాలు వినేందుకు చాలామంది పిల్లలు ఆసక్తి కనబర్చేవారు. ఇక 1993లో పదవీవిరమణ చేశాక తన సొంత గ్రామం రాయ్‌పురాకు వచ్చేశారు. అక్కడ గ్రామీణ ప్రాంతంలోని యువత సాధికారికత కోసం శ్రమించాడు.
మంచి ఫలితాలు సాధించాడు. ఎక్కువగా ఇంటర్ విద్యార్థులకు హిస్టరీ క్లాసులు చెప్పేవాడు. ఇలా చాలా కాలం చెప్పాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బు తన సొంత అవసరాలకు ఖర్చు చేయలేదు. దాంతో ఓ ట్రస్టును ఏర్పాటు చేశాడు.

ఈ ట్రస్టు ద్వారా చదువకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేస్తుంటారు. పరీక్షకు ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు మహేంద్ర ప్రసాద్ సింగ్ సహాయం చేస్తుంటారు.ఇలా చదువుకున్న విద్యార్థుల్లో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, అధికారులుగా తయారయ్యారు. ఈ సారి దసరాకు ఆ గ్రామం నుంచి వచ్చిన కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు అంతా కలవాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా మంచి మార్కులతో పాసైన విద్యార్థులకు కలెక్టర్ల చేతులమీదుగా బహుమానాలు అందిచేందుకు ప్లాన్ చేశారు మహేంద్ర. అంతేకాదు ఆ గ్రామం నుంచి ఉన్నతస్థానాలకు వెళ్లిన వారి జీవిత చరిత్రను ఒక పుస్తకరూపంలో తీసుకొచ్చేందకు ప్రయత్నం చేస్తున్నాు మహేంద్ర. ఇలా చేస్తే ఎంతో మంది విద్యార్థుల్లో స్ఫూర్తి వస్తుందని భావిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications