వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ నిర్మాణ కూలీ తన ఏడాది వయస్సున్న కొడుకును కాపాడటానికి పోరాడుతున్నాడు

Google Oneindia TeluguNews

సామ్రాట్ తండ్రి మనోజ్ మాట్లాడుతూ 'సామ్రాట్ ప్రపంచంలోకి వచ్చిన మొదటిరోజును నేను అసలు మర్చిపోలేను. నా భార్య వాడిని దగ్గరగా హత్తుకొని ఉంది. మా బాబు మా ఇద్దరినీ తల పైకెత్తి పెద్ద పెద్ద అందమైన కళ్లతో చూసాడని నాకింకా గుర్తుంది. ఆ క్షణాన నేను ప్రపంచంలో అందరి కన్నా ఆనందంగా ఉన్నాననిపించింది." అని ఆ అపురూప క్షణాలను గుర్తు చేసుకున్నారు.

ఈనాడు మనోజ్ తన కొడుకు ప్రాణం కోసం పోరాడుతున్నారు. తమ బాబును మొదటిసారిగా ఇంటికి తీసుకొచ్చి, తమ జీవితాలలో కొత్త అధ్యాయం మొదలు పెట్టిన సమయంలో జీవితం సామ్రాట్ తల్లిదండ్రులకి అద్భుత కథ కంటే ఏం తక్కువ కాదు. కానీ తొందరలోనే బాధ, కష్టం వారిని వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. సామ్రాట్ తరచుగా జ్వరాలు, జలుబుతో అనారోగ్యం పాలవ్వడం మొదలైంది. వాడి ఆరోగ్యం మరింత దెబ్బతింది. టెస్టుల్లో ఆ చిన్నారి బాబు న్యుమోనియాతో బాధపడుతున్నట్టు తెలిసింది.

ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి, కొంచెం ఆరోగ్యం మెరుగయ్యాక డిశ్చార్జి చేసారు. సామ్రాట్ కుటుంబం ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఆ సంతృప్తి కూడా ఎక్కువ సమయం నిలవలేదు. మళ్లీ జ్వరం తిరగబెట్టింది. ఈసారి అసలు తగ్గలేదు.

సామ్రాట్ నాన్న మాట్లాడుతూ 'మేము మళ్ళీ అనేక రకాలయిన టెస్టులు చేయించాం, ఈసారి మా బాబు వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటే గుండెలో చిల్లి ఉందని తెలిసి కృంగిపోయాం. డాక్టరుతో మాట్లాడాక ఈ చేదు వార్తని నా భార్యకి చెప్పటం నాకింకా గుర్తుంది. ఆమె ఆసుపత్రిలోనే కుప్పకూలిపోయి భోరుమంది.' అని బాధను పంచుకున్నారు.

బాబుకి అర్జెంటుగా గుండెకి ఆపరేషన్ చేయాలి. దానికి రూ.3 లక్షలు ఖర్చవుతుంది. 'నేను అంత డబ్బు ఎలా సమకూర్చాలి' 'నేనొక సామాన్య భవన నిర్మాణ కూలీని. బాగుంటే రోజుకి రూ.300 వస్తాయి. అదే పని దొరకని రోజున ఇంటికి ఉట్టిచేతులతో రావాల్సి వస్తుంది. నా భార్య గృహిణి. ఇప్పుడు సామ్రాట్ అనారోగ్యంతో మా ఖర్చులు ఆకాశాన్ని అంటాయి. నేను ఇప్పటికే నా బాబు చికిత్స కోసం రూ.2 లక్షల అప్పు చేశాను. ఇప్పుడు ఇంకా రూ.3 లక్షలు కావాలి. నేను ఇక అప్పు చేసే స్థితిలో లేను. ఎందుకంటే ఇప్పటికి చేసినవి తీర్చడానికే నా జీవితం సరిపోతుంది.' అన్నాడు.

బాబు కుటుంబం డబ్బు సరిగా లేక తనను హాస్పిటల్లో అడ్మిట్ చేయలేకపోయింది. తను ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ మందులపై బ్రతుకుతున్నాడు. 'వాడు చాలా బలహీనపడిపోయాడు. సరిగ్గా మంచంపై కూచోలేకపోతున్నాడు కూడా. అనుక్షణం శ్వాస కోసం ఇబ్బందిపడుతున్నాడు.' అని సామ్రాట్ నాన్న తెలిపారు.

బాబు కుటుంబం ఇక్కడ ఫండ్ రైజర్ మొదలుపెట్టింది. మనందరిలాగానే సామ్రాట్‌కి కూడా ఒక ఆరోగ్యకరమైన, సంతోషమైన జీవితం గడిపే హక్కుందని మనం గుర్తుంచుకుందాం. మనందరం కలిస్తే, ఏదో ఒక అద్భుతం తప్పక చేయవచ్చు. అందుకే ఈ బిడ్డను కాపాడటానికి మనందరం చేతులు కలుపుదాం. మీ తరఫు నుండి సాయం ఎంత చిన్నదైనా సామ్రాట్ గుండె ఆపరేషన్‌కి అయ్యే ఖర్చులో పెద్ద సాయమే అవుతుంది. తగినంత మొత్తాన్ని చేరుకోడానికి మాకు తప్పక సాయం చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X