• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూటి కోసం కోటి విద్యలు: బక్రీద్ సమయంలోనే ఈ వ్యక్తి అశోక్ నుంచి అహ్మద్ అవుతాడు

|

కూటి కోసం కోటి విద్యలు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఏంచేసినా ఎంత చేసినా అదంతా కడుపులోకి నాలుగు ముద్దలు పంపేందుకే. ఇక్కడ కూడా రాజస్థాన్‌కు చెందిన అశోక్ అనే అబ్బాయి ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అశోక్ అనే ఈ కుర్రాడు బక్రీద్ పండుగకు మేకలను విక్రయిస్తూ ఉంటాడు. అసలే బక్రీద్ పండగ. పైగా తను విక్రయించే చోటు కచ్చితంగా ఒక మసీదుకు ఎదురుగానే ఉంటుంది. మరలాంటప్పుడు తన మేకలకు చాలా డిమాండ్ ఉంటుంది. అందుకోసమే దళితుడైన అశోక్.. బక్రీద్ సమయానికి తన పేరును అహ్మద్‌గా మార్చుకుంటాడు. ఇలా ప్రతి ఏటా తన పేరును మార్చుకుని మేకలను భారీ సంఖ్యలో విక్రయిస్తూ ఉంటాడు.

అశోక్ కాస్త అహ్మద్‌గా ఎందుకు మారాడో అడిగితే దీని వెనక పెద్ద కథే ఉందంటాడు. సాధారణంగా అక్కడి కస్టమర్లు మేకలను కొనాలంటే సొంత సామాజిక వర్గం వారి దగ్గరినుంచే కొంటారట. అశోక్ హిందూ దళితుడని తెలిస్తే తన మేకలు అమ్ముడుబోవని చెబుతున్నాడు. అంతేకాదు కొన్నిసార్లు తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందంటాడు. అందుకే తన పేరును ఎప్పటికీ అక్కడి వారికి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటానంటాడు. తన స్నేహితుల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని చెబుతున్న అశోక్... వారు కూడా బక్రీద్ సమయంలో మేకలను అమ్ముతారని చెప్పాడు. అయితే తన పేరును తన కులాన్ని మాత్రం వారు బహిర్గతం చేయరని అశోక్ చెప్పాడు. అక్కడ కనీసం 5శాతం మంది వ్యాపారస్తులు తనలానే పేరు మార్చుకుని బిజినెస్ చేస్తుంటారని చెప్పాడు.

 This man changes his name from Ashok to Ahmad during Eid Festival..you know Why?

అయితే తమ వాస్తవ పేర్లను సాటి వ్యాపారుల వద్ద దాచమని చెబుతున్నఅశోక్ తమ మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని తెలిపాడు. "మా పండగ కాకపోయినప్పటికీ... ఆ సాధు జంతువులను చంపేస్తామని తెలిసినప్పటికీ సమాజం మమ్మలను ఎందుకు అర్థం చేసుకోదో"అని ఆవేదన వ్యక్తం చేశాడు అశోక్. ఇక ఒక్క బక్రీద్ సమయంలోనే తను మేకలను అమ్ముతానని..మిగతా సమయంలో ఓ కిరాణా దుకాణం నడుపుతానని చెప్పుకొచ్చాడు.

ఆగష్టు 17నే తన మేకలను తీసుకొచ్చి మసీదు ఎదురుగా ఉంచుతాడు అశోక్. తన ప్రాణ మిత్రుడు నవాబ్ కురేషీ కూడా అక్కడే తన మేకలను విక్రయిస్తూ ఉంటాడు. అయితే అశోక్ మరో సామాజిక వర్గానికి చెందిన వాడని ఎప్పటికీ నవాబ్ చెప్పడని తమ స్నేహం మీద ఉన్న నమ్మకం అలాంటిదని అశోక్ చెబుతున్నాడు. ఒకవేళ చెబితే ఆ ప్రభావం నవాబ్ పై కూడా పడుతుందని అశోక్ తెలిపాడు. మూడురోజుల క్రితం ఇద్దరి దగ్గర కలిపి 300 మేకలు ఉండేవని ఇప్పుడు అన్నీ అమ్ముడుపోయి కేవలం 10 మేకలు మాత్రమే ఉన్నట్లు అశోక్ చెప్పాడు.గత 30 ఏళ్లుగా ఇక్కడ మేకలను విక్రయిస్తున్నాడు అశోక్. ఇప్పటి వరకు అతని పేరు అహ్మద్‌గానే చాలామందికి తెలుసు. అదే పేరును మెయింటెయిన్ చేస్తున్నాడు అశోక్. తనకు మేకలు అమ్ముడుపోయి వ్యాపారం బాగా జరగడమే ముఖ్యమని అలాంటప్పుడు తనకు మతం, కులంతో పనిలేదని అవి తనకు తిండి పెట్టవని అశోక్ చెబుతున్నాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ashok Kumar, 52, is among the many cattle traders selling sacrificial goats at the Jama Masjid market ahead of Eid-ul-Adha. For the 10-odd days that Kumar spends at the market before the festival each year, he goes by the name of Ahmad Khan.The changed identity not just helps him escape the taboo attached to selling animals for slaughter, it also ensures "steady sales".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more