టైమింగ్ అంటే ఇదీ : బీటెక్ బాబు.. నీ తెలివికి సోషల్ మీడియా అవాక్కు
పతనంతిట్ట (కేరళ) : చాలా విషయాలకు సంబంధించి సమయం.. సందర్భం.. రావాలనే మాటలు మనం తరుచూ వినేవే. కానీ, వాటిని సరిగ్గా ఆచరణలో పెట్టేవారు కొంతమందే ఉంటారు. అసలు కానే కాదనకున్న పనిని సైతం.. పక్కా టైమ్ చూసి తమ సమయస్ఫూర్తితో కానిచ్చేస్తుంటారు. తాజాగా ఇదే తరహాలో తన టాలెంట్ బయటపెట్టిన ఓ స్టూడెంట్ వీడియో ఇప్పుటు సోషల్ మీడియాలో హల్-చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని ముసలియర్ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్ తన వివాహానికి రావాల్సిందిగా తన స్టూడెంట్స్ ను ఆహ్వానించాడు. అందరితో పాటే వివాహానికి హాజరైన శ్రీనాథ్ అనే బీటెక్ స్టూడెంట్.. ప్రొఫెసర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు వధువరులు ఉన్న స్టేజీ పైకి ఎక్కాడు. అయితే.. అందరిలా గిఫ్ట్ ఇవ్వడమో, విషెస్ చెప్పి వెనుతిరిగడమో చేసుంటే శ్రీనాథ్ గురించి ఇంత మాట్లాడుకోవాల్సి వచ్చేది కాదేమో..!

స్టేజీ ఎక్కిన శ్రీనాథ్.. తిన్నగా తమ ప్రొఫెసర్ దగ్గరికెళ్లి, తన ప్రాజెక్టు రికార్టును ప్రొఫెసర్ చేతిలో పెట్టాడు. కాలేజీలో అయితే పని కాదనుకున్నాడో ఏమో గానీ, సదరు స్టూడెంట్ చేసిన చర్యకు ప్రొఫెసర్ కూడా ఇక సంతకం పెట్టకుండా తప్పించుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే, శ్రీనాథ్ చేసిన పనికి అటు పెళ్లి కూతురితో పాటు పెళ్లికి హాజరైన జనం ముసిముసిగా నవ్వుకున్నారు. మొత్తానికి అందరిచేత భలేవాడివయ్యా బాబు అనిపించుకున్నాడు శ్రీనాథ్.












Click it and Unblock the Notifications