వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజ‌రాత్ లో ఆ ముగ్గురు మ‌హిళ‌ల గురి...! ఉత్కంఠ రేపుతున్న రాజ‌కీయ ఎంట్రీ ...!!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌/హైద‌రాబాద్ : ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఎన్నికల వేడి పెరిగింది. ఇక్కడ ఈ సారి జరిగే ఎన్నికల్లో అందరి చూపు ముగ్గురు మహిళలపై పడింది. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహపడుతున్న ఈ ముగ్గురు మహిళల గురించే ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఈ ముగ్గురు మహిళలు ఇప్పటి వరకు రాజకీయాల్లో అడుగుపెట్టనప్పటికీ తొలిసారిగా బరిలో దిగుతుండడంతో అందరి దృష్టి వీరిపై పడింది. ఈ ముగ్గురు మహిళలు ఎవరు? వీరికి అంత ప్రాధాన్యత ఏమిటీ? అనేదాని గురించేగా మీరంతా ఆలోచిస్తున్నారు. ఇపుడు వారి గురించి తెలుసుకుందాం.!

ప్ర‌ముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, మధ్య ప్రదేశ్‌ గవర్నర్‌, మాజీ గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌ కుమార్తె అనార్‌, పాటీదార్‌ నాయకురాలు రేష్మాపటేల్‌. ఈ ముగ్గురు మహిళలు ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపేందుకు సిద్దమవుతున్నారు. ఆనార్‌ ఏదో ఒక లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈమెకు టిక్కెట్టు కోసం తల్లి ఆనంద్‌బెన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రివాబా కూడా ఇటీవలే బీజేపీలో చేరి జామ్‌నగర్‌ లోక్‌సభ నుంచి పోటీచేసేందుకు సిద్దమయ్యారు.

బీజేపీ అంటే ఇష్టం లేదు, సుమలతకు మద్దతు, సీఎం కొడుకు అవసరమా ? నటుడు ప్రకాష్ రాజ్ !బీజేపీ అంటే ఇష్టం లేదు, సుమలతకు మద్దతు, సీఎం కొడుకు అవసరమా ? నటుడు ప్రకాష్ రాజ్ !

Those three women in Gujarath politics..! became sensation their entry..!!

రేష్మాపటేల్‌ తాజాగా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమె పోరుబందర్‌ నుంచి ఎన్సీపీ అభ్యర్ధిగా బరిలో దిగే యోచనలో ఉన్నారు. ఒక వేళ టిక్కెట్టు రాకుంటే స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలో దిగాలని యోచిస్తున్నారు. వీరి ముగ్గురి ఎంట్రీ గుజ‌రాత్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన‌ట్టు తెలుస్తోంది.

English summary
Prime Minister Modi's own state of Gujarat has increased the election heat. In this election, all the three women have fallen in the elections. These three women who are enthralled in the election are now discussing across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X