చెన్నై అపార్ట్‌మెంట్స్ గొడవ: నటి మాలాశ్రీకి బెదిరింపులు

బెంగళూరు: బహుబాష నటి మాలాశ్రీని చెంపేస్తామని బెదిరించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తన మొబైల్‌ కు ఈ నెల 24వ తేదిన చెన్నయ్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి మేము చెప్పినట్లు వినకపోతే నీ ప్రాణాలు తీస్తామని బెదిరించారని మాలాశ్రీ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం మాలాశ్రీకి చెన్నైలో అపార్ట్మ్ంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ బాగోగులు చూసుకొవడానికి ఒకరిని నియమించారు. ఈ పనులు చూసుకొవడానికి అతనికి మాలాశ్రీ నెలకు రూ. రెండు లక్షలు ఇచ్చే వారు. ఇటివల మాలాశ్రీ ఆపార్ట్‌మెంట్స్‌ను విక్రయించారు. ఈ సందర్బంలో అపార్ట్మెంట్స్ నిర్వహణల భాద్యతలు చూసుకుంటున్న అతను మరొ వ్యక్తితో కలిసి మాలాశ్రీని సంప్రందించారు.

Threatening calls to actress Malasree

అపార్ట్‌మెంట్స్‌ను విక్రయించిన సోమ్మలో తమకు భాగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు మాలాశ్రీ నిరాకరించడంతో ప్రాణాలు తీస్తామని బెదిరించారని పోలీసులు తెలిపారు. మాలాశ్రీని బెదిరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నటి మాలాశ్రీ తెలుగులో ప్రేమఖైధి, అల్లరి పోలీసు, ఆంధ్ర కిరణ్ బేడి, సాహసవీరుడు సాగరకన్య, భధ్రాచలం, బంగారు మొగుడు, బావ బావమరిది, చాముండి, ఘరాన అల్లుడు, మన్మద సామ్రాజ్యం, నీ ప్రేమకే తదితర చిత్రాలలో నటించారు. సుమన్ తో కలిసి మాలాశ్రీ ఎక్కువ సినిమాలలో నటించారు. కన్నడలో ఒక్క వెలుగు వెలిగిన మాలాశ్రీ నెంబర్ వన్ స్థానానికి చేరుకునింది. కన్నడలో లేడి అమితాబ్ బచ్చన్ అని పేరు తెచ్చుకుని యాక్షన్ సినిమాలు చేసింది. మాలాశ్రీ కన్నడలో నటించిన అనేక సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేశారు. కన్నడలో భారీ చిత్రాలు నిర్మిస్తున్ననిర్మాత రామును మాలాశ్రీ వివాహం చేసుకునింది. ప్రస్తుతం మాలాశ్రీ నాలుగు సినిమాలలో నటిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+