బ్యాంకులో ముగ్గురి అనుమానాస్పద మృతి, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, అయ్యప్ప దీక్ష !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బ్యాంకులో రాత్రి ఒకే చోట నిద్రపోయిన ముగ్గురు వ్యక్తులు ఉదయానికి శవమై కనించారు. శరీరం మీద ఎలాంటి గాయాలు లేకపోయినా నిద్రపోతున్న చోట ముగ్గురూ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో స్థానికులు హడలిపోయారు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఉన్న బ్యాంకులోనే ఈ ఘటన చోటు చేసుకునింది.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని ఉళ్లాలలోని తలవాడి కేసీ రోడి ప్రాంతంలో కోటేకారు వ్యవసాయ సేవా సంఘం శాఖ బ్యాంకు ఉంది. సోమారం రాత్రి సంతోష్ (37), ఉమేష్(60), సోమనాథ్ (56) కోటేకారు వ్యవసాయ సేవా సంఘం శాఖ బ్యాంకు కార్యాలయంలోకి వెళ్లి నిద్రపోయారు.

Three man suspected death near Mangaluru in Karnataka.

మంగళవారం ఉదయం కోటేకారు వ్యవసాయ సేవా సంఘం శాఖ బ్యాంకు కార్యాలయం ఉద్యోగులు అక్కడికి వెళ్లారు. ఉమేష్, సంతోష్, సోమనాథ్ నిద్రపోతున్న చోట శవమై కనిపించారు. ముగ్గురూ ఒకే సారి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో స్థానికులు హడలిపోయారు. ఉమేష్ అయ్యప్ప స్వామి మాల వేసుకుని ధీక్ష చేస్తున్నాడు.

మృతులలో ఉమేష్, సంతోష్ బ్యాంకు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సందర్బంలో బ్యాంకు లోపల జనరేటర్ ఆన్ చేశారని పోలీసులు గుర్తించారు. అసలు ఏం జరిగింది అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మంగళూరు నగర పోలీసు కమిషర్ టీఆర్. సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three man suspected death near Mangaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి