బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

బెంగళూరులో రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా ముందడుగు పడింది. కర్ణాటక పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్‌ను ఆహ్వానించింది. అదే సమయంలో నగర శివార్లలో మూడు ప్రదేశాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. దీనికి సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం కన్సల్టెంట్‌ను సైతం నియమించనుంది. ఎయిర్ పోర్ట్ అథారిటీ చేపట్టిన ప్రాథమిక అంచనా తర్వాత కేఎస్ఐడీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పెరుగుతున్న తాకిడిని దృష్టిలో ఉంచుకుని రెండో ఎయిర్ పోర్ట్ ను నిర్మించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి మూడు స్థలాలు ఎంపిక అయ్యాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మూడు స్థానాల్లో బెంగళూరు- కనకపుర రోడ్డు సమీపంలో గల చూడాహళ్లి, సోమనహళ్లితో పాటు నేలమంగళ- కుణిగళ్ మధ్య స్థలాన్ని షార్ట్ లిస్ట్ చేసింది ఏఏఐ.

Three Sites Chosen for Bengaluru New Airport Near Kanakapura and Nelamangala after gets AAI Nod

ప్రతిపాదిత విమానాశ్రయం కోసం సుమారు 4,500 ఎకరాల అవసరమౌతాయని, ప్రస్తుతం ఎంపిక చేసిన మూడు చోట్ల కూడా ఖాళీ స్థలం ఉన్నట్లు ఏఏఐ అధికారికంగా కర్ణాటక ప్రభుత్వానికి తెలియజేసింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చూడాహళ్లి, సోమనహళ్లి వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కనకపుర.. ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం. హోమ్ మంత్రి జీ పరమేశ్వర నేలమంగళ- కుణిగల్ వైపు ఈ ఎయిర్ పోర్ట్ నిర్మిస్తే బాగుంటుందని తెలుస్తోంది.

రెండు రోజుల కిందటే ఆయన ఢిల్లీలో పర్యటించారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. దీని తర్వాత పరిణామాలు శరవేగంగా మారాయి. ఎయిర్ పోర్ట్ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ ను రూపొదించాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.

బెంగళూరులో విమాన ప్రయాణీకులు, కార్గో రవాణా డిమాండ్ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో కెంపేగౌడ ఎయిర్ పోర్ట్ కు అనుబంధంగా ఈ రెండో విమానాశ్రయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే 35 సంవత్సరాల కాలానికి ప్రయాణీకులు, కార్గో ట్రాఫిక్‌ను అవసరాలకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధం కానుంది. వీటితో పాటు ప్రతిపాదిత విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ఖర్చులతో సహా ఆర్థికపరమైన సాధ్యాసాధ్యాలను కూడా అధ్యయనం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+