three terrorists kill four jawans injure encounter security forces militants jammu and kashmir shopian జమ్ముకశ్మీర్ ముగ్గురు ఉగ్రవాదులు నలుగురు జవాన్లు గాయాలు భద్రతా దళాలు
కశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. నలుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. షోపియాన్ పట్టణంలోని జాన్ మొహల్లా ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఓ ఇంటిలో మిలిటెంట్లు దాక్కున్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దాంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరు అల్ ఖైదా ప్రభావిత ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్వాత్ ఉల్ హింద్ అగ్రశ్రేణి కమాండర్ అని భావిస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో చేతులు కలిపిన ఏజీహెచ్ జమ్మూ కశ్మీర్ లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మరికొందరు మిలిటెంట్లు ఉన్నారని భావిస్తుండడంతో ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని కశ్మీర్ పోలీసు విభాగం వెల్లడించింది.

ఎన్ కౌంటర్‌లో నలుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కడపటి వార్త అందే సమయానికి కూడా ఎన్ కౌంటర్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.