టైమ్ మ్యాగజైన్ ఇష్యూ : ఆ రచయితది పాకిస్థాన్ ఎజెండా : బీజేపీ
న్యూఢిల్లీ : టైమ్ మ్యాగజైన్ పై ప్రధాని మోడీ కవర్ పేజీ ప్రచురించి, డివైడర్ ఇన్ చీఫ్ అని హెడ్ లైన్ పెట్టడంపై బీజేపీ స్పందించింది. ఆ హెడ్ లైన్ పెట్టిన జర్నలిస్టు తసీర్ పాకిస్థాన్ ఎజెండా తీసుకున్నాడని విమర్శించింది. అంతేకాదు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన రీ ట్వీట్ ను తప్పుపట్టారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా.

సంక్షేమమే పరమావధి ..
2014లో కూడా కొన్ని మ్యాగజైన్లు మోడీ గెలవరని విమర్శించాయని పాట్రా పేర్కొన్నారు. మోదీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. దేశంలో సంస్కరణలు అమల్లోకి వచ్చి ముందుడుగు దిశగా పయనిస్తోందని తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్ నేత సిద్దూ చేసిన జాత్యాంహకార, సెక్సియిస్ట్ ఆరోపణలను కూడా పాత్రా ఖండించారు.

అది వారి పద్ధతి
ప్రధాని మోడీని సిద్దు టార్గెట్ చేశారని పాత్రా ఆరోపించారు. ఇటీవల మోడీ ప్రభుత్వం .. బ్రిటీష్ హయాన్ని తలపిస్తోందని సిద్దూ విమర్శించిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే పాట్రా స్పందించారు. అది వారి మైండ్ సెట్ అని ఆరోపించారు.

తసీర్ ఇన్ఫో మార్చారు ..
ఇటు మోడీపై కథనం రాసిన ఆతిష్ తసీర్ గురించి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా మార్చి వేశారు. తసీర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారంటూ యాడ్ చేశారు. మోడీ గురించి ‘టైమ్'లో వ్యాసం రాగా, ఆ మరుసటి రోజు వికీపీడియా పేజీని మార్చివేశారు. దానిని బీజేపీ సోషల్ మీడియా యూజర్ చౌకీదార్ శశాంక్ సింగ్ ట్వీట్ చేయగా, అది ఇప్పుడు రిట్వీట్ అవుతుంది.

కథనంతో కాంగ్రెస్ పీఆర్ మేనేజర్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ ప్రపంచ దిగ్గజంగా ఎదగాలంటే మోడీ లాంటి నేత అవసరమని గతంలో టైమ్ మేగజీన్ కవర్ పేజీతో ఆయన ఇంటర్వ్యూను ప్రచురించింది. ఇప్పుడు ఆ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయని, భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తానంటూ అధికారంలోకి వచ్చిన మోదీ అన్నింటా విఫలమయ్యారని, ఆయన చర్యలు జాతీయ వాదానికి బీజం వేశాయంటూ విమర్శించింది. దీంతో కోపం వచ్చిన బీజేపీ సోషల్ మీడియా జర్నలిస్ట్, రచయిత అయిన ఆతిష్ తసీర్‌ను కాంగ్రెస్ పీఆర్ మేనేజర్‌ను చేసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications