భారతదేశపు డివైడర్ అంటూ మోడీపై టైమ్ మ్యాగజైన్ వివాదాస్పద హెడ్ లైన్
భారత దేశాన్ని విభజించేవాడు అన్న వివాదాస్పద హైడ్ లైన్ తో అమెరికాకు చెందిన న్యూస్ మ్యాగజైన్ "టైమ్"వ్యంగ్యంగా ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను కవర్ పేజీపై ప్రచురించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . మే-20,2019న విడుదల అయ్యే ఈ మ్యాగజైన్ ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ చాలా వివాదాలు సృష్టించేదిగా ఉంది.
హిందూ ముస్లిం ల మధ్య మతపరమైన విభజన చేసే వ్యక్తిగా మోడీని ఈ ఆర్టికల్ లో అభివర్ణించారు. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా అన్న హెడ్ లైన్ తో ఈ ఆర్టికల్ ను అతిష్ తఫీర్ రాశారు.నెహ్రూ,మోడీకి మధ్య వ్యత్యాసం గురించి కూడా ఈ ఆర్టికల్ లో ఉంది. మోడీ హయాంలో హిందూ-ముస్లిం సంబంధాలు, నెహ్రూని తిట్టడం ద్వారా హిందూ అనుకూలమైన వ్యక్తులుగా నిరూపించుకోవడం వంటి అనేక అంశాల ఆధారంగా ఈ ఆర్టికల్ రాయబడింది. ఇక ఈ ఆర్టికల్ లో మోడీని ఏకిపారేశారు .

గుజరాత్ అల్లర్లను కూడా ఈ ఆర్టికల్ లో గుర్తు చేశారు. అయితే మోడీ గురించి గతంలో కూడా టైమ్స్ మ్యాగజైన్ ఈ విధంగా వివాదాస్పదమైన కామెంట్రీ రాసింది . 2012లో మోడీని వివాదాస్పదమైన అంశాలపై ఆసక్తి చూపించే తెలివైన రాజకీయనాయకుడిగా టైమ్స్ తన మ్యాగజైన్ లో ఓ ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది. అప్పట్లో అదికూడా పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు కవర్ పేజీపై వ్యంగ్యంగా ఉన్న మోడీ ఫొటో పక్కన భారతదేశాన్ని విభజించేవాడు అనే హెడ్ లైన్ పెట్టి మరీ మోడీపై చాలా నెగిటివ్ ఆర్టికల్ రాసింది టైమ్స్ మ్యాగజైన్ .
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications