త్రిపురలో గేమ్ స్పాయిలర్ గా తిప్రా మోథా ! కాంగ్రెస్-సీపీఐ కూటమి ఆశలపై నీళ్లు-బీజేపీకి మేలు..

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకోబోతోంది. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో తాజాగా ప్రకటించిన ఫలితాల ప్రకారం బీజేపీ 34 సీట్లు సాధించే దిశగా అడుగులేస్తోంది. దీంతో మ్యాజిక్ మార్క్ 31 సీట్లు దాటి మరోసారి అధికారం చేపట్టబోతోంది. బీజేపీకి ఈసారి గట్టి పోటీ ఇస్తాయని భావించిన కాంగ్రెస్-సీపీఐ కూటమితో పాటు తిప్రా మోథా పార్టీ పేరుతో చేతులు కలిపిన మరో కూటమి కూడా ఓటమిపాలయ్యాయి. అయితే ఇందులో తిప్రా మోథా మిగతా పార్టీలకు చేసిన నష్టం భారీగానే కనిపిస్తోంది.

తాజా అంచనాల ప్రకారం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 34 సీట్లు, లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి 14 సీట్లు, తిప్రా మోథా కూటమి 12 సీట్లు సాధించబోతున్నాయి. అయితే ఇందులో తిప్రా మోథా కూటమి సాధించిన 12 సీట్లతో పాటు దాదాపు 20 సీట్లలో ఇతర పార్టీల అవకాశాల్ని దెబ్బతీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 60 సీట్లలో 42 సీట్లలో పోటీ చేసిన తిప్రా మోథా కూటమి ప్రత్యేక తిప్రా ల్యాండ్ డిమాండ్ తో ముందుకెళ్లింది. అయితే అటు అధికార బీజేపీ కానీ, విపక్షంలో ఉన్న లెఫ్ట్, కాంగ్రెస్ కానీ ఈ డిమాండ్ ను పట్టించుకోలేదు. బీజేపీ సుపరిపాలన, అభివృద్ధి పేరుతోనే ఎన్నికలకు వెళ్లింది. కానీ 16 గిరిజన సీట్లలో బలమున్న తిప్రా మోథా.. అధినేత ప్రద్యోత్ దేవ్ వర్మ దూకుడు కారణంగా మరికొన్ని చోట్ల కూడా లెఫ్ట్ కూటమి అవకాశాల్ని దెబ్బతీసింది. అలాగే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఐపీఎఫ్టీ అవకాశాల్నీ సైతం దెబ్బతీసింది. దీంతో గత ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన ఐపీఎఫ్టీ ఈసారి ఒక్క సీటుకే పరిమితమైంది.

tipra motha spoiled not only congress-cpi duos chances but also bjp ally ipft also

ప్రత్యేక తిప్రా ల్యాండ్ డిమాండ్ తో సొంత రాజకీయం మొదలుపెట్టిన తిప్రా మోథా తొలిసారి 12 సీట్లు గెల్చుకుంటోంది. అయితే ఈ డిమాండ్ ను వ్యతిరేకించిన పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకున్నాయి. దీంతో తిప్రా ల్యాండ్ డిమాండ్ కు స్ధానికంగా మద్దతు లేదని తేలిపోయింది. అదే సమయంలో స్ధానిక పార్టీల కూటమి అయిన తిప్రా మోతా ఓట్ల చీలికకు పనికొచ్చింది. తద్వారా విపక్ష కూటమితో పాటు అధికార కూటమిలోని స్ధానిక పార్టీ ఐపీఎఫ్టీ అవకాశాల్ని కూడా దెబ్బతీసింది. ఇంతా చేశాక బీజేపీ తిప్రా ల్యాండ్ మినహా తిప్రా మోథా అన్ని డిమాండ్లు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+