చెన్నై వేదికగా ఒలింపిక్స్? సీఎం విజయ్ సంచలన ప్రకటన..

క్రీడారంగాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. చెన్నై నగరాన్ని ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. శాసనసభ సాక్షిగా గురువారం ఆయన చేసిన భారీ ప్రకటనలు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాభిమానులను, యువతను ఉత్సాహపరిచాయి. రాజధాని చెన్నైలో అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన "తమిళనాడు ఒలింపిక్ సిటీ"తో పాటు, మోటార్ స్పోర్ట్స్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఒక "మోటార్‌స్పోర్ట్స్ సిటీ"ని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించబోయే ఈ ఒలింపిక్ సిటీలో క్రీడాకారులకు అవసరమైన అత్యంత ఆధునిక శిక్షణా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లను ఇక్కడ నెలకొల్పుతారు. అంతేకాకుండా, దేశ విదేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, కోచ్‌ల కోసం పక్కా వసతి సదుపాయాలు కల్పిస్తారు. మన క్రీడాకారులు ఒలింపిక్స్ తో పాటు అంతర్జాతీయ వేదికలపై పసిడి పతకాలతో త్రైవర్ణ పతాకాన్ని ఎగరవేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు.

TN CM Vijay Announces Mega Olympic City In Chennai Dedicated Motorsports City To Bring F1 Racing Back
త్వరలోనే ఒలింపిక్స్‌లోకి యోగా? ప్రధాని సంచలన వ్యాఖ్యలు!
త్వరలోనే ఒలింపిక్స్‌లోకి యోగా? ప్రధాని సంచలన వ్యాఖ్యలు!

చెన్నైలో ఫార్ములా-1 హంగామా..

కార్ల రేసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం విజయ్, ఫార్ములా-1 నుంచి ఫార్ములా-4 వరకు అన్ని రకాల రేసులను నిర్వహించేందుకు వీలుగా.. ప్రత్యేకంగా ఒక మోటార్‌స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని ప్రకటించారు. స్థానిక యువతలోని డ్రైవింగ్, రేసింగ్ ప్రతిభను వెలికితీసి, వారికి అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లుగా ఎదిగేందుకు శిక్షణ ఇస్తామన్నారు. మోటార్ రేసింగ్ ట్రాక్‌ల ఏర్పాటు వల్ల కేవలం క్రీడలే కాకుండా పర్యాటక రంగం, ప్రత్యేక వాహనాల తయారీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరుగులు తీస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!
సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!

2028 నాటికి భారత్‌లో ఫార్ములా-1 రీ-ఎంట్రీ!

మరోవైపు, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా దేశంలోకి మోటార్‌స్పోర్ట్స్‌ను, ముఖ్యంగా ఫార్ములా-1 ప్రదర్శనలను తిరిగి తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. 2028 నాటికి భారత్‌లో ఎఫ్‌-1 రేసింగ్‌ను మళ్లీ పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం ముందుస్తుగా స్పందించి మోటార్‌స్పోర్ట్స్ సిటీని ప్రకటించడం, చెన్నైని ప్రపంచ రేసింగ్ మ్యాప్‌లో నిలబెట్టే దిశగా ఒక మాస్టర్ స్ట్రోక్‌గా భావించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+