వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోచుకోవడానికే రజనీకాంత్ రాజకీయాల్లోకి: తమిళనాడు మంత్రి: సీఎంకు మరో తలనొప్పి

రజనీకాంత్ రాజకీయాల్లో అడుగుపెడితో అధికారంలో ఉన్న మా పార్టీ కుప్పకూలిపోతుందో అంటూ ఆందోళన చెందుతున్నారని సమాచారం. రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెడితో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దత

|
Google Oneindia TeluguNews

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ దెబ్బకు తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (అమ్మ) వర్గానికి కంటిమీద కునుకులేకుండా పోయింది. రజనీకాంత్ విషయంలో ఏం మాట్లాడాలో అర్థంకాక అధికారంలో ఉన్న నాయకులు ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు.

రజనీకాంత్ మీడియా షాక్: పోయెస్ గార్డెన్ కు పరుగో పరుగు: సినీ స్టార్స్ క్యూ, ఒక్క దెబ్బతో !రజనీకాంత్ మీడియా షాక్: పోయెస్ గార్డెన్ కు పరుగో పరుగు: సినీ స్టార్స్ క్యూ, ఒక్క దెబ్బతో !

రజనీకాంత్ రాజకీయాల్లో అడుగుపెడితో అధికారంలో ఉన్న మా పార్టీ కుప్పకూలిపోతుందో అంటూ ఆందోళన చెందుతున్నారని సమాచారం. రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెడితో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఎక్కడ జంప్ జిలాని అంటారో అంటూ హడలిపోతున్నారు.

అందుకేనా ఆ భయం ?

అందుకేనా ఆ భయం ?

అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే రెండు వర్గాలుగా నిలువునా చీలిపోయింది. అంతే కాకుండా అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు మరో మూడు గ్రూపులుగా చీలిపోయారు. మా డిమాండ్లు తీర్చితే మీకు మద్దతు ఇస్తామని, లేదంటే మా దారి మేము చూసుకుంటామని ఇప్పటికే ఎడప్పాడి పళనిసామిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

రజనీకాంత్ దెబ్బతో డిమాండ్ల మోత !

రజనీకాంత్ దెబ్బతో డిమాండ్ల మోత !

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు పలు డిమాండ్లతో ఎడప్పాడి పళనిసామికి నిద్రలేకుండా చేస్తున్నారు. అవసరం అయితే ప్రభుత్వాన్ని కూల్చేసి రజనీకాంత్ గూటిలో చేరిపోవడానికి కొందరు ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని తెలిసింది.

తెరమీదకు మంత్రులు !

తెరమీదకు మంత్రులు !

రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా మా పార్టీకి ఎలాంటి నష్టం లేదని కొందరు మంత్రులు చెబుతున్నారు. అయితే అధికారంలో ఉన్న మంత్రులు పైకి అలా చెబుతున్నా లోపలమాత్రం టెన్షన్ గానే ఉన్నారని రాజకీయ విశ్లేకులు అంటున్నారు.

దోచుకోవడానికి వస్తున్నారా ?

దోచుకోవడానికి వస్తున్నారా ?

సినిమా రంగంలో సంపాదించింది చాలదని ఇంకా డబ్బు దోచుకోవడానికి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారా ? అంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీవీ. షణ్ముగం ప్రశ్నించారు. ఏకారణంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారో చెప్పాలి ? అంటు న్యాయ శాఖా మంత్రి షణ్ముగం డిమాండ్ చేస్తున్నారు.

నేను రజనీకాంత్ అభిమాని, అయితే ?

నేను రజనీకాంత్ అభిమాని, అయితే ?

ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలోని సీనియర్ మంత్రి, శశికళకు అత్యంత సన్నిహితుడు సెల్లూర్ రాజు మాత్రం నేను రజనీకాంత్ వీరాభిమాని అంటున్నారు. తాను వ్యక్తిగతంగా రజనీకాంత్ ను గౌరవిస్తాను అని చెప్పారు. అయితే అభిమానం వేరు, రాజకీయాలు వేరు అంటున్నారు మంత్రి సెల్లూరు రాజు.

రజనీకాంత్ దెబ్బతో అధికార పార్టీకి ఇబ్బంది ?

రజనీకాంత్ దెబ్బతో అధికార పార్టీకి ఇబ్బంది ?

రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తే మాత్రం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (అమ్మ) పార్టీకి మాత్రం ఇబ్బందులు ఎదురౌతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రజనీకాంత్ దెబ్బకు ప్రభుత్వం కుప్పకూలిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.

ఎడప్పాడికి తలనొప్పి తప్పదా ?

ఎడప్పాడికి తలనొప్పి తప్పదా ?

అధికారంలో ఉన్న కొందరు మంత్రులు సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో ఎదోఒక విధంగా మాట్లాడుతున్నారని, వీరి మాటలకు సీఎం ఎడప్పాడి పళనిసామికి కొత్త తలనొప్పులు ఎదురౌతాయని సమాచారం. మొత్తం మీద రజనీకాంత్ వియంలో కొందరు మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మొదటికే మోసం వస్తోందని తమిళ ప్రజలు అంటున్నారు.

English summary
I am also a fan of Rajinikanth said Minister Sellur Raju. He said I have respect on Rajini personally. But can not accept that rajini. TN law minister asks actor Rajinikanth that he gained more money with that of rotten system only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X