అక్షయ్ కుమార్ స్టంట్ అని.. విమానం నుంచి దూకేశాడు

ముంబై: తన అభిమాన సినీ హీరో అక్షయ్ కుమార్ సినిమాల్లో చేసే స్టంట్లను నిజం జీవితంలో చేయాలనుకున్నాడు ఓ అభిమాని. అంతే, అతని పిచ్చి ఆలోచనతో లాండైన వెంటనే విమానం నుంచి దూకేశాడు. అది కూడా 15 ఫీట్ల ఎత్తులోవున్న ఎమర్జెన్సీ డోర్‌లోంచి. దీంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అతడ్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేస్తున్న అకాశ్ జైన్‌(30)కు హీరో అనిపించుకోవాలన్నది ఓ కోరిక. దీంతో అక్షయ్ కుమార్ స్టంట్ చేయాలనే ఉద్దేశంతో హెర్కులస్ సి130జె రకం విమానం(9డబ్ల్యూ 469)ను ఎంచుకున్నాడు. విమానం ఎయిర్ పోర్టులో ఆగిన వెంటనే ఎమర్జెన్సీ డోర్ తీసి 15 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేశాడు.

TOO FILMY: Here's why being 'Akshay Kumar' fan is a bad idea!

ఈ ఘటన మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో జరుగగా, సిసిటీవీల ద్వారా విషయం గమనించిన పోలీసులు రాత్రి 9.30గంటల ప్రాంతంలో అతడ్ని అరెస్ట్ చేశారు. కాగా, అంతకుముందు అతడు విమానం నుంచి దూకిన తర్వాత అతడు గోవా వెళ్లాలని భావించాడు. తొలుత బంద్రాకు, అక్కడి నుంచి పొరపాటున బెల్గాం వెళ్లే బస్సు ఎక్కాడు. తప్పు తెలుసుకొని పుణె కు క్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని తల్లి ద్వారా తెలుసుకొని గోవా ట్రిప్ రద్దు చేసుకుని ముంబై బయలుదేరాడు. అతడి కదలికలు పూర్తిగా ట్రాక్ చేసిన పోలీసులు తూర్పు బాంద్రా సమీపంలోని ఖేర్ వాడి సిగ్నల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు అతనికి ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+