వివాహేతర సంబంధాల్లో టాప్ 5 నగరాలు ఇవే..!

భారతదేశంలో వివాహేతర సంబంధాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్‌ఫాం గ్లీడెన్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం.. వివాహేతర సంబంధాల సంఖ్యలో దేశవ్యాప్తంగా బెంగళూరు నగరం మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు తర్వాత ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, పుణే నగరాలు తదుపరి స్థానాల్లో ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

గ్లీడెన్ సర్వేలోని గణాంకాలు..

ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది వివాహితులపై నిర్వహించబడింది. వారిలో దాదాపు 45 శాతం మంది తాము వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నట్లు అంగీకరించారు. నగరాల వారీగా ఈ గణాంకాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులో 37%, ముంబయిలో 31%, కోల్‌కతాలో 27%, ఢిల్లీలో 25%, పుణెలో 22% మంది వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సంబంధాలు పెట్టుకున్న వారిలో ఎక్కువ మంది ఐటీ, మెడికల్, కార్పొరేట్ రంగాలకు చెందినవారు ఉన్నారని నివేదిక స్పష్టం చేస్తోంది.

top-five-cities-in-extramarital-affairs-according-to-survey

వివాహేతర సంబంధాలకు కారణాలు..

  • వివాహేతర సంబంధాల పెరుగుదల వెనుక అనేక సామాజిక, వ్యక్తిగత కారణాలు ఉన్నాయని గ్లీడెన్ సర్వే విశ్లేషించింది.
  • ఐటీ ఉద్యోగాల ఒత్తిడి, షిఫ్ట్ వర్క్ కారణంగా కుటుంబానికి సమయం లేకపోవడం ముఖ్య కారణాలుగా ఉన్నాయి.
  • సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త పరిచయాలు
  • భాగస్వాముల మధ్య భావోద్వేగ దూరం
  • కమ్యూనికేషన్ లోపం వంటి వ్యక్తిగత సమస్యలు
  • స్వతంత్ర జీవనశైలి ఆకర్షణ కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.

ఈ ధోరణిపై మనస్తత్వ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా సంబంధాలు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వవచ్చు కానీ.. దీర్ఘకాలంలో మానసిక క్షోభ, కుటుంబ విరోధాలు, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. వివాహేతర సంబంధాల పెరుగుదలతో పాటు విడాకుల రేటు కూడా పెరుగుతోందని గ్లీడెన్ సర్వేలోని వెల్లడించింది. 2024లో భారతదేశంలో ప్రతి 100 వివాహాలలో 8 వివాహాలు విడాకులతో ముగిశాయని.. ఇందులో ఎక్కువశాతం మూడో వ్యక్తి జోక్యం కారణంగా జరిగినవే అని నివేదిక తెలిపింది.

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు ఈ ధోరణిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్లీడెన్, టిండర్, బంబుల్ వంటి యాప్‌లు "డిస్క్రీట్ రిలేషన్షిప్స్" పేరుతో వివాహేతర సంబంధాలకు వేదికలుగా మారాయని నివేదిక చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+