Girls: స్కూల్ లో లైబ్రరీ, ల్యాబ్ లో ఒకే తరగతి అమ్మాయిలను టార్గెట్ చేసిన టీచర్, ఎక్కడంటే అక్కడ ?
చెన్నై/ తిరువణ్ణామలై: ప్రభుత్వ స్కూల్ అండ్ కాలేజ్ లో లో 750 మందికి పైగా అమ్మాయిలు, అబ్బాయిలు చదువుతున్నారు. పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు అదే స్కూల్ లో చదువుతున్నారు. స్కూల్ లో లైబ్రరీ, ల్యాబ్ లో ఇన్ చార్జ్ గా పని చేస్తున్న టీచర్ వయసుకు వచ్చిన అమ్మాయిల మీద కన్నువేశాడు. ల్యాబ్ లో, లైబ్రరీలో అమ్మాయిలతో మాట్లాడుతున్నట్లు నటించిన టీచర్ వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఒకేసారి వంద మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు స్కూల్ ముందు కామాంధుడైన టీచర్ ను బుద్ది చెప్పాలని వెళ్లడం కలకలం రేపింది.

ఫేమస్ స్కూల్ అండ్ ఇంటర్ కాలేజ్
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోని కున్నత్తూర్ లో హయ్యర్ సెకండరీ గ్రేడ్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది. ప్రభుత్వ స్కూల్ అండ్ కాలేజ్ లో లో 750 మందికి పైగా అమ్మాయిలు, అబ్బాయిలు చదువుతున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు అక్కడ విద్యార్థులు చదువుతున్నారు.

లైబ్రరీ, ల్యాబ్ ఇన్ చార్జ్
పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు అదే స్కూల్ లో చదువుతున్నారు. హెడ్ మాస్టర్ నందినితో సహ మొత్తం 30 మంది టీచర్లు ఆ స్కూల్ లో ఉద్యోగం చేస్తున్నారు. అరణి సమీపంలోని సోమతంగల్ గ్రామంలో నివాసం ఉంటున్న గోవిందస్వామి (60) అదే స్కూల్ లో ల్యాబ్, లైబ్రరీ ఇన్ చార్జ్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

8వ తరగతి అమ్మాయిలు టార్గెట్
లైబ్రరీలో బుక్స్ తీసుకోవాలని, ల్యాబ్ లో ప్రయోగాలు చెయ్యాలని వెలుతున్న అమ్మాయిల మీద టీచర్ గోవిందస్వామి కన్ను వేశాడు. 10వ తరగతి, ఇంటర్ అమ్మాయిలతో పెట్టుకుంటే సమస్యలు వస్తాయని భయపడిన గోవిందస్వామి 8వ తరగతి చదువుతున్న అమ్యాయిలనే టార్గెట్ చేసుకుని వారిని శారీరకంగా ముట్టుకోవడం మొదలుపెట్టాడు.

దిమ్మతిరిగిపోయింది
చాలాకాలంగా అమ్మాయిలో టీచర్ గోవిందస్వామి అసభ్యంగా ప్రవర్తించి వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. భయపడిన కొందరు అమ్మాయిలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయారు. రానురాను గోవిందస్వామి ఆగడాలు ఎక్కువ కావడంతో కొందరు అమ్మాయిలు వారి కుటుంబ సభ్యులకు మ్యాటర్ చెప్పారు.

కామాంధుడు అరెస్టు
ఒకేసారి వంద మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు స్కూల్ ముందు కామాంధుడైన టీచర్ గోవిందస్వామికి బుద్దిచెప్పాలని స్కూల్ దగ్గరకు వెళ్లి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తిపరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని 8వ తరగతి చదువుతున్న అమ్మాయిలను స్కూల్ లో రహస్య విచారణ చేశారు. టీచర్ గోవిందస్వామి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెలుగు చూడటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications