Torture: బెడ్ రూమ్ లో భార్య, అదే ఇంట్లో ఉరి వేసుకున్న భర్త, బంధువు టార్చర్, వెంటపడి వదల్లేదని !
చెన్నై: భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త 9 నెలల క్రితం పాపకు తండ్రి అయ్యాడు. వ్యాపారం చేస్తున్న భర్త సంవత్సరం క్రితం వరకు భార్యతో చాలా సంతోషంగా జీవించాడు. వ్యాపారం చేస్తున్న భర్త కొందరు బంధువుల దగ్గర అప్పు చేశాడు. రానురాను వ్యాపారం అంతంతమాత్రంగానే జరిగింది. చేసిన అప్పులకు భారీ మొత్తంలో వడ్డీ కడుతున్న భర్త ఒత్తిడికి గురైనాడు. ఇదే సమయంలో ఇంట్లో కుటుంబ సమస్యలు మొదలైనాయి. ఎటు చూసినా సమస్యలు ఎక్కువ కావడంతో భర్త సతమతం అయ్యాడు. ఇదే సమయంలో భార్యతో భర్తకు గొడవలు మొదలైనాయి. బార్య, చిన్నారి బెడ్ రూమ్ లో నిద్రపోయిన తరువాత ఇంట్లో భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బైక్ ల వ్యాపారం
తమిళనాడులోని తిరువరూర్ సమీపంలోని విజయపురలోని మొట్టుపాళ్యంలో సతీష్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం సతీష్ ఉమా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సతీష్ సెకండ్ హ్యాండ్ బైక్ లు కొనుగోలు చెయ్యడం, వాటిని తరువాత వేరే వ్యక్తులకు విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు.

బందువు దగ్గర అప్పు చేశాడు
సెకండ్ హ్యాండ్ బైక్ ల వ్యాపారం చేస్తున్న సతీష్ వ్యాపారం చెయ్యడానికి బంధువు ముత్తయ్య దగ్గర అప్పుడు చేశాడు. తీసుకున్న అసలులో కొంత డబ్బులు, వడ్తీని ముత్తయ్యకు చెల్లిస్తూ వచ్చిన సతీష్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ సందర్బంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో వ్యాపారం పూర్తిగా దెబ్బ తినడంతో సతీష్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

రూ. 1.50 లక్షల కోసం టార్చర్
వడ్డీకి తీసుకున్న డబ్బులో చాలా మాత్రం ముత్తయ్యకు చెల్లించిన సతీష్ ఇంకా రూ. 1.50 లక్షలు చెల్లించలేదని తెలిసింది. ఇదే సమయంలో వడ్డీకి ఇచ్చిన ముత్తయ్య తనకు అసలుతో పాటు వడ్డీ మొత్తం ఇచ్చేయాలని, తాను ఇక ముందు నీకు టైమ్ ఇవ్వనని సతీష్ ను టార్చర్ చెయ్యడం మొదలు పెట్టాడని తెలిసింది.

టైమ్ కూడా ఇవ్వలేదు
వ్యాపారం జరగడం లేదని, ఆరు నెలలు టైమ్ ఇస్తే తీసుకున్న అసలుతో పాటు వడ్డీ మొత్తం తిరిగి చెల్లిస్తానని సతీష్ అతని బంధువులు ముత్తయ్యకు మనవి చేశాడు. అయితే ప్రతిరోజూ గ్యాప్ కూడా ఇవ్వకుండా ముత్త తన డబ్బు తనకు ఇచ్చేయాలని సతీష్ ను టార్చర్ చేశాడని తెలిసింది. సతీష్ కుటుంబ సభ్యులు చెప్పినా కూడా ముత్తయ్య మాట వినలేదని తెలిసింది.

బెడ్ రూమ్ లో భార్య, ఇంట్లో భర్త ఆత్మహత్య
చేసిన అప్పులకు భారీ మొత్తంలో వడ్డీ కడుతున్న ఉమా భర్త సతీష్ తీవ్ర ఒత్తిడికి గురైనాడు. ఇదే సమయంలో ఇంట్లో కుటుంబ సమస్యలు మొదలైనాయి. ఎటు చూసినా సమస్యలు ఎక్కువ కావడంతో సతీష్ సతమతం అయ్యాడు. ఇదే సమయంలో భార్య ఉమాతో భర్త సతీష్ కు గొడవలు మొదలైనాయి. రాత్రి బార్య ఉమా, చిన్నారి బెడ్ రూమ్ లో నిద్రపోయిన తరువాత ఇంట్లో సతీష్ ఉ












Click it and Unblock the Notifications