హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు భారీ జరిమానా!
లక్నో: ట్రాఫిన్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించడం సాధారణమే. కానీ, ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదని ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు భారీ జరిమానా విధించారు. దీంతో సదరు డ్రైవర్ ఆశ్చర్యంతోపాటు ఆవేదనకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. గఢ్‌ముక్తేశ్వర్ గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించలేదని గురువారం రూ. 3000 జరిమానా విధించారు. అంతేగాక, డ్రైవింగ్ లైసెన్స్ తనతో ఉంచుకోలేదని ఈ చలాన్ విధించినట్లు నోటీసు అందజేశారు. దీంతో బాధితుడు ట్రాఫిక్ అధికారులను సంప్రదించాడు.
ట్రాక్టర్‌ను నడిపిస్తున్న తనకు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించడం ఏంటని ప్రశ్నించాడు. పరిశీలించిన అధికారులు చలాన్ విధించే క్రమంలో కంప్యూటర్‌లో టైప్ చేసేప్పుడు వచ్చిన లోపంగా గుర్తించారు. అతనికి విధించిన చలాన్‌ను రద్దు చేసినట్లు చెప్పారు.

కాగా, సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రాలు ఈ సవరణ చట్టం ప్రకారం జరిమానాలు విధించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు పాత జరిమానాలనే కొనసాగిస్తున్నాయి.
కొన్ని రాష్ట్రాలు మాత్రం కొత్త వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలను కొత్త చట్టం ప్రకారం ఉన్న జరిమానాలను కొంత తగ్గించి విధిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ రాష్ట్రాల్లో కొత్త చట్టం ప్రకారం జరిమానాలను విధించమని ప్రకటించాయి.
కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ. 500-10,000 వరకు జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అంతేగాక, ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే రూ. 1000 జరిమినా విధిస్తారు. నిర్ణీత వేగం కంటే ఎక్కువ వేగంతో వెళితే.. రూ.1000-2,000 వరుక జరిమానా విధించడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితితిలో ప్రయాణించే వాహనాలు అంబులెన్స్, ఫైరింజిన్లకు దారి ఇవ్వకపోతే రూ. 10వేలు జరిమానా విధిస్తారు. అనర్హత వేటుపడిన డ్రైవర్ వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా విధిస్తారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications