దబాంగ్ కాదు, బాంగ్ చాక్లెట్స్, తింటే మత్తుతో పాటు కిక్కే కిక్కు, ఏం స్కెచ్ రా !

బెంగళూరు/మంగళూరు: మత్తు పదార్థాలు విక్రయించడానికి నిందితులు అనేక ప్లాన్లు వేస్తున్నారు. చాక్లెటలు విక్రయాలు ఎక్కువ కావాలని కొందరు ఆ చాక్లెట్స్ లో మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నారు. గంజాయి సిగెరెట్లు, గంజాయితో తయారు చేసిన స్వీట్లు విక్రయించి చాలా మంది ఇప్పటికే అడ్డంగా బుక్కైపోయారు. విద్యార్థులు, మత్తుకు బానిస అయిన వారికి మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్ లు విక్రయిస్తున్న వ్యాపారులు అడ్డంగా చిక్కిపోయారు.

కర్ణాటకలోని మంగళూరు నగరంలోని షాపుల్లో విక్రయిస్తున్న బాంగ్ చాక్లెట్‌లో డ్రగ్స్ ఉన్నట్లు తేలడంతో ఇద్దరు షాపు యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరులోని కార్ స్ట్రీట్ పూజా ప్యాలెస్ బిల్డింగ్‌లోని వైభవ్ పూజ సేల్స్ యజమాని మనోహర్ సేట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోషి తహసీల్ లోని మిష్లీ విలేజ్ సమీపంలోని ఘపౌరా పోస్ట్‌లో నివాసం ఉంటున్న బెచన్ సోంకర్ అనే నిందితులు అరెస్టు అయ్యారు.

 Traders selling drug-laced bhang chocolates arrested in Mangaluru.

మంగళూరు నగరంలోని నార్త్ పోలీస్ స్టేషన్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినప్పుడు నిందితులు నగరంలోని కార్ స్ట్రీట్‌లోని పూజా ప్యాలెస్ భవనంలోని వైభవ్ పూజా సేల్స్ అనే దుకాణంలో బాంగ్ చాక్లెట్‌ను గుర్తించారు. ఆ సమయంలో పోలీసులు బాంగ్ చాక్లెట్లు కలిగిన 300 ప్యాకెట్లు, 592 విడి చాక్లెట్లతో పాటు మొత్తం 12,592 బాంగ్ చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

బాంగ్ చాక్టెల్ల మొత్తం విలువ అంచనా వేశారు. అదే రోజు మంగళూరు సౌత్ పోలీస్ స్టేషన్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించగా నగరంలోని హాయ్‌ల్యాండ్ సమీపంలోని ఓ దుకాణంలో బాంగ్ కలిపిన చాక్లెట్లను గుర్తించారు. నిందితుడు షాపు యజమాని బెచన్ సోంకర్ వద్ద ఉన్న కోటి విలువైన బాంగ్ చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 Traders selling drug-laced bhang chocolates arrested in Mangaluru.

స్వాధీనం చేసుకున్న బాంగ్ చాక్లెట్లను డ్రగ్ కంటెంట్‌ను గుర్తించేందుకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పుడు బాంగ్ చాక్లెట్లలో గంజాయి ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుండి నివేదిక వచ్చింది. కాబట్టి ఎన్‌డీపీఎస్‌పై మనోహర్ సేట్, బెచన్ సోంకర్ మీద పలు సెక్షల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని, ఈ దందాలు ఇంకా ఎంత మంది ఉన్నారు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+