అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్..ఇస్రో కీలక ప్రకటన
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో సోమవారం (డిసెంబర్ 30) స్పేడెక్స్‌ను ప్రయోగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలోని షార్ నుంచి స్పేడెక్స్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఇస్రో కీలక ప్రకటన చేసింది. తొలుత సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ వల్లే అనుకున్న సమయానికి జరగాల్సిన ప్రయోగానికి అంతరాయం ఏర్పడినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ తెలిపారు.

రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితికి దారితీసింది. దీంతో ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం అయిందని ఆయన వివరించారు. 9.58 గంటలకు బదులుగా 10 గంటల 15 సెకన్లకు రీషెడ్యూల్ చేశామని సోమ్‌నాథ్ వెల్లడించారు. కొన్ని ఉపగ్రహాలు ఇదే దారిలో వస్తున్నట్లు ఇస్రోలోని నిపుణులు గుర్తించారు. అందుకే రెండు నిమిషాలు ఆలస్యంగా స్పేడెక్స్‌ను ప్రయోగిస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.












Click it and Unblock the Notifications