Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..?

ఇండియన్ రైల్వేస్ కు గణనీయమైన చరిత్ర కలిగి ఉంది. భారత్ లో రైల్వే వ్యవస్థ అతిపెద్ద నెట్ వర్క్ ను కలిగిఉంది. నిత్యం వేలమంది ప్రయాణికులు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. రైలులో ప్రయాణం సులభతరంతో పాటుగా తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా చెబుతారు. అందుకే చాలామంది మనదేశంలో రైలు ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బస్సుల్లో వెళ్లలేని అనేక సుదూర ప్రాంతాలకు రైలు సదుపాయం కలిగి ఉంది.

అయితే నిత్యం వేల మంది ప్రయాణించే ఇండియన్ రైల్వేస్ లో ఇటీవలికాలంలో కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రైలు బోగీలను తమ సొంతిళ్లుగా మార్చుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలుస్తున్న రైల్వేలో వంట చేసుకోవడం, ఎలక్ట్రిక్ కెటిల్ ను వినియోగించడం, ఇతర రకరకాల వంటలను చేసుకుంటున్న వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అలాగే రైలు బోగీలో ఏసీ ఫ్యాన్ ఏర్పాటు చేసుకుని నిద్రించడం, రైలులో రొమాన్స్ చేస్తున్న ప్రేమికుల వీడియోలు కనిపించాయి.

అయితే ఇప్పుడు మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో కొందరు యువకులు ఒకే చోట రౌండ్ గా కూర్చుని రైలు బోగీలోనే అందరూ చూస్తుండగానే మద్యం సేవిస్తున్నారు. కదిలే రైలులో యువకులు బహిరంగంగా మద్యం సేవించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

train or Bar Youths Caught Drinking Alcohol Openly on Moving Train Viral Video social media news

ఈ వీడియో చూసిన నెటిజన్లు అది రైల్వే బోగీనా? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు. అలాగే సివిక్ సెన్స్ అనేది మనకు అస్సలు అందని ద్రాక్షలా మారిపోయింది అంటూ నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. నిత్యం వేల మంది ప్రయాణించే రైలులో ఇలాంటి పనులు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+