ఈ సీజన్ లో ప్రయాణాలకు బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..!
కొత్త సంవత్సరంలో కొత్త ప్రదేశాలను చూడాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సీజన్ లో బెస్ట్ టూరిస్టు ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఉత్తరాదిలో మంచు పర్వతాల అందాలు, ఇటు దక్షిణాదిలో ఆహ్లాదకరమైన తీర ప్రాంతాలు, దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. ఈ నెలలో మీరు తప్పక సందర్శించాల్సిన ప్లేసెస్ ఏంటంటే..?
రాజస్థాన్.. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ సందర్శనకు జనవరి అత్యంత అనువైన సమయంగా ఉంది. వేసవిలో ఉండే ఎండల తీవ్రత ఇప్పుడు ఉండదు. అందువల్ల చాలామంది పర్యటకులు ఈ సమయంలో రాజస్థాన్ పర్యటనకు వెళ్తుంటారు. రాజస్థాన్ లోని జైపూర్, ఉదయ్ పూర్ కోటలు అలాగే జైసల్మేర్ ఎడారిలో ఒంటె సవారీ. పొగమంచుతో నిండిన ఎడారి సాయంత్రాలు టూరిస్టులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.
ఇక ఆగ్రాలోని తాజ్ మహల్.. ప్రపంచ వింత తాజ్ మహల్‌ను మంచు దుప్పటి కప్పుకున్నట్లు చూడాలంటే జనవరి నెలలోనే బెస్ట్ టైమ్. మిగతా సమయాలతో పోల్చితే ఈ నెలలో టూరిస్టుల రద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది. తెల్లని పాలరాతి కట్టడం చుట్టూ అలుముకున్న పొగమంచు ఫోటోగ్రఫీకి అద్భుతంగా ఉంటుంది. అండమాన్ దీవులు.. ఇక్కడ స్కూబా డైవింగ్, స్నోర్కెల్లింగ్ ద్వారా సముద్ర గర్భంలోని కోరల్ రీఫ్స్ ను చూడటానికి ఇది కరెక్ట్ సమయం అని చెప్పొచ్చు.

దక్షిణ భారత కాశ్మీర్ గా పిలువబడే మున్నార్ అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ జనవరిలో అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడి తేయాకు, కాఫీ తోటల మీదుగా వీచే చల్లని గాలులు, మంచు మేఘాలు మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇది హనీమూన్ జంటలకు బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. అలాగే హంపి.. చారిత్రక నగరం.. కర్ణాటకలోని హంపి శిథిలాల మధ్య నడవాలంటే ఈ సీజన్ బెటర్ అని సమాచారం. ఇక్కడ ఉండే రాతి కొండల వల్ల వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ జనవరిలో ఎండ, చలి సమపాళ్లలో ఉండి టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది.
-
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications