ఊర్మిళ మతం మారింది..! ఎందుకో తెలుసా?
ముంబై : బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మతం మారిపోయింది. అంతే కాదు ఆమె పేరు, తల్లిదండ్రుల వివరాలు సర్వం మారిపోయాయి. అయితే అవన్నీ ఆమె నటిగా ఉంటే ఎవరూ పట్టించుకోకపోయేవారు. కానీ ఈసారి లోక్‌సభ బరిలోకి దిగిన కారణంగా ఆమె మతం, పేరు అన్నీ మారిపోవడం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఊర్మిళ మటోండ్కర్. అయితే ఆమెకు వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు ట్రోల్స్ స్టార్ట్ చేశారు. అదేక్రమంలో ఆమె వికీపీడియా పేజీలో పేరు, తల్లిదండ్రులు, మతం, కుటుంబ నేపథ్యం అలా సర్వం మార్చేశారు. వాటి స్థానంలో తప్పుడు వివరాలు అప్‌లోడ్ చేశారు. దాంతో ఊర్మిళ ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ అవుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆకతాయిల చర్యల పట్ల ఫైరవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు పనిలో పనిగా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీ నేతలు నీచానికి దిగజారి ఊర్మిళ వివరాలు మార్చారని ధ్వజమెత్తారు. ఇలాంటి పనికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి శ్రీకాంత్ మటోండ్కర్ డిమాండ్ చేశారు. అదలావుంటే ఊర్మిళ పేరును కాస్తా నెట్టింట్లో మరియమ్ అక్తర్ మిర్ గా మార్చేశారు. ఆమె ఇస్లాం మతానికి చెందినట్లుగా అందులో పేర్కొన్నారు. 2015లో కశ్మీరీ వ్యాపారవేత్త మొహసీన్ అక్తర్ మిర్‌ను పెళ్లిచేసుకున్నట్లు తప్పుడు వివరాలు నమోదు చేశారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications