హీరో రజనీకాంత్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటి
అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమిళ సూపర్ స్టార్ రజనికాంత్‌ను కలిశారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ఆర్తిరెడ్డిలు రజనీకాంత్‌ను కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలకు సేవచేయాలని రజనీకాంత్ సూచంచినట్టు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోహిత్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉండగా... రోహిత్ రెడ్డి కుటుంబానికి, రజినీకాంత్‌కు చాలాకాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో రోహిత్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు ఫంక్షన్లకు కూడా రజనీకాంత్ హాజరయ్యారు.

అయితే రజనీకాంత్‌ను ఎందుకు కలిశాడనే దానిపై స్పందించిన ఎమ్మెల్యే అది తమ వ్యక్తిగత అంశమని చెప్పారు. హీరో రజనీకి అనేక మంది అభిమానులు ఉన్నారని అందులో తాను ఒకడినని పేర్కోన్నారు. కాగా గతంలో కూడ రజినీకాంత్‌ను పలుమార్లు కలిసినట్టు సమాచారం.
రోహిత్ రెడ్డి ఇటివల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్ధి, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ రవాణశాఖ మంత్రి మహెందర్ రెడ్డిపై గెలుపోందాడు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications