తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లు విడుదల, ఈ డేట్, టైమ్ మిస్ అయితే కష్టం, లక్కీచాన్స్ !

తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. సామాన్య భక్తులు టీటీడీ ఎప్పుడెప్పుడు రూ. 300 టిక్కెట్లు విడుదల చేస్తుందా అంటూ ఎదురు చూస్తుంటారు. ఇక శ్రీవారి అర్జిత సేవల టిక్కెట్ల కోసం పోటీ పడుతుంటారు. శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవలు, కల్యాణోత్సవం, అర్జిత బ్రహోత్సవాలు, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు పోటీ పడుతుంటారు. శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు నెలల పాటు వేచి చూస్తుంటారు. శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనుంది.

ttd
తిరుమల శ్రీవారి భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు.

సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్ల విడుదలచేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని శుక్రవారం టీటీడీ కోరడమైనది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+