కర్ణాటకలోని కొడుగు రిసార్ట్ లో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు, విందు, చిందులతో జల్సా !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు కర్ణాటకలోని మడికేరి జిల్లా కొడుగు (కూర్గ్) సమీపంలోని విలావసవంతమైన రిసార్ట్ కు తరలించారు. కొడుగు సమీపంలో కట్టుదిట్టమైన భద్రత ఉన్న రిసార్ట్ లో టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తున్నారు.

నడి రోడ్డులో ఏసీపీ కామపిచ్చి: మహిళా ఎస్ఐ మీద చెయ్యి ఎక్కడ వేశాడంటే (వీడియో)

TTV Dinakaran camp MLAs stay at Coorg in Karnataka

పుదుచ్చేరికి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న రిసార్ట్ లో గత 17 రోజుల నుంచి టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు, దినకరన్ క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యే జక్కయ్యన్ గురువారం పుదుచ్చేరి రిసార్ట్ నుంచి గోడదూకేశారు.

చెన్నై చేరుకున్న తరువాత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి మద్దతు ప్రకటించి స్పీకర్ ధనపాల్ కు లేఖ ఇచ్చారు. పుదుచ్చేరి సమీపంలోని రిసార్ట్ లోనే ఎమ్మెల్యేలు ఉంటే ఇంకా కొందరు జారుకునే అవకాశం ఉందని పసిగట్టిన టీటీవీ దినకర్ అలర్ట్ అయ్యాడు.

షాక్: రెబల్ ఎమ్మెల్యేలకు ముచ్చటగా మూడో సారి నోటీసులు ఇచ్చిన స్పీకర్; అనర్హత వేటు !

కచ్చితంగా రెబల్ ఎమ్మెల్యేలకు సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం గాలం వేస్తారని భావించిన టీటీవీ దినకరన్ ఎమ్మెల్యేలను కర్ణాటకలోని మైసూరు నగర శివార్లలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడికి చెందిన రిసార్ట్ కు తరలించాలని ప్లాన్ వేశారు.

TTV Dinakaran camp MLAs stay at Coorg in Karnataka

చివరి నిమిషంలో దక్షిణ భారత కాశ్మీర్ అనే పేరు ఉన్న కొడుగు ప్రాంతంలోని విలాసవంతమైన రిసార్ట్ కు 18 మంది దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కర్ణాటక అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ప్రధాన కార్యదర్శి పూహళేంది, రెబల్ ఎమ్మెల్యేల నాయకులు తంగతమిళ సెల్వన్, వెట్రివేల్ ఎమ్మెల్యేలు జారిపోకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK Sources said that the Dinakaran Supporting MLAs will stay at Coorg, Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి