Daily Hunt:వేగవంతమైన ఎన్నికల ఫలితాలు, విశ్లేషణాత్మక కథనాల కోసం ట్యూన్ అవ్వండి..!
న్యూఢిల్లీ: మే 2వ తేదీన దేశంలో జరిగిన మినీ ఎలక్షన్ వార్ ఫలితాలు వెలువడనున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికలు వాడీవేడీగా సాగాయి. అధికార పార్టీ టీఎంసీ, జాతీయ పార్టీ బీజేపీ మధ్య ఓ యుద్ధమే జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో మూడో సారి ముచ్చటగా విజయం సాధించి అధికారంలోకి తిరిగి రావాలని మమత బెనర్జీ భావిస్తుండగా... బెంగాల్‌లో మెజార్టీ స్థానాలపై బీజేపీ కన్నేసింది. అంతేకాదు అధికారంలోకి వచ్చేందుకు కూడా బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది.
తమిళనాడులో జయలలిత శకం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార అన్నాడీఎంకేకు కష్టాలు తప్పలేదు. డీఎంకే - కాంగ్రెస్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైనట్లు తెలుస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో డీఎంకే - కాంగ్రెస్‌లు మెజార్టీ లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నాయి. ఇక పుదుచ్చేరిపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత ఆరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సాగుతోంది. ఇప్పటి వరకు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచింది. అయితే ఈ సారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఏఎన్‌ఆర్‌సీతో జతకట్టిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేరళలో పరిస్థితి మరోలా ఉంది. లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ల మధ్యే ఇప్పటి వరకు ఓటర్లు మొగ్గు చూపేవారు. కానీ తొలిసారిగా కేరళలో రెండో సారి ఒకే ప్రభుత్వం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టే దిశగా కనిపిస్తోంది.

ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి డైలీ హంట్ ఎప్పటికప్పుడు లైవ్‌లో ఫలితాలను అందిస్తోంది. ఎన్నికలు కేవలం సంఖ్యలతో ముడిపడినవి కాదు. సమాచారం, విశ్లేషణపై ప్రత్యేక దృష్టి సారించి మంచి కథనాలను అందిస్తాం. ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వెలువడగానే విశ్లేషణాత్మక కథనాలు మీకు అందిస్తాం. వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఎందుకు అలా వచ్చాయో విశ్లేషిస్తాం. ప్రతి ఒక్కరు మా విశ్లేషణతో సంతృప్తి చెందేలా కథనాలు ఉంటాయి. రాజకీయ విశ్లేషకులు సైతం సంతృప్తి పడేలా ఎన్నికల ఫలితాలకు సంబంధించి విశ్లేషణ ఉంటుంది.
డైలీ హంట్ ఎన్నికల కవరేజీ పెద్దఎత్తున చేస్తోంది. ఫలితాలు వెలువడే రోజున అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌తో పాటు ఫలితాలను వేగంగా మీకు అందిస్తాం. గత ఎన్నికల ఫలితాలను పోల్చుతూ కూడా కథనాలను అందిస్తాం. రాష్ట్రాల వారీగా అదే సమయంలో నియోజకవర్గాల వారీగా సీట్లు మార్పుతో ప్రభావం వంటి అంశాలను విశ్లేషిస్తాం.ఇక సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫలితాలపై ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారో కూడా తెలుపుతాం. ట్విటర్‌లో ట్రెండింగ్ అంశాలను కూడా కథనాలుగా మలచి మీకు అందిస్తాం. లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, ట్రెండింగ్ కథనాలు, వీడియోలతో డైలీ హంట్ మీ ముందుంటుంది. ఫలితాలు రోజున తప్పక డైలీ హంట్‌పై లాగిన్ అవ్వండి. ఐదు రాష్ట్రాలకు సంబంధించి వేగవంతమైన ఫలితాలను ముందుగా మీరే పొందండి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications