గృహహింస: షలీన్ బానోత్‌పై కేసు పెట్టిన టీవీ నటి
న్యూఢిల్లీ: ఒకప్పుడు ఆ జంట బుల్లితెర(టీవీ)పై ఓ వెలుగు వెలిగిన ప్రేమజంట. అంతేకాదు, ఆ ప్రేమజంట నిజ జీవితంలో ప్రేమించుకున్నరు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు కూడా. ‘నాచ్ బచాలియే' సీజన్-4 విజేతలుగా కూడా వీరు నిలిచారు. బుల్లితెర భార్యాభర్తలుగా అలరించిన ఈ జంట పయనం.. ఇప్పుడు విడాకుల దిశగా సాగుతోంది. ఆ జంటే టీవీ నటుడు షలీన్ బానోత్, దల్జీత్ కౌర్.
వివరాల్లోకి వెళితే.. తనను శరీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తన భర్త షలీన్ బానోత్‌పై దల్జీత్ కౌర్ ఫిర్యాదు చేసింది. షలీన్ పెట్టే హింస తట్టుకోలేక తన కొడుకు షారవ్‌తో కలిసి బెంగళూరులోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని ఓ ఆంగ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
తమ స్థాయికి తగ్గ సంబంధం రాలేదనే కోపంతో తనను అత్తగారు వివాహమైన మరుసటి రోజు నుంచే వేధించేవారని చెప్పింది. తన తండ్రికి ముగ్గురు కూతుర్లని, ఆయన పెద్ద మొత్తంలో కానుకలు ఇచ్చే పరిస్థితిలో లేరని తెలిపింది. ఓసారి తన తండ్రి ముందే తోసేశాడని, దీంతో తన కాలికి తీవ్ర గాయమైందని చెప్పింది. అయినా అతడ్ని క్షమించి అతనితో ఉండేందుకే ప్రయత్నించానని తెలిపింది.

తాను గర్భవతి అయిన తర్వాత తనకు అస్తమా వచ్చిందని, అయితే తనను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా షలీన్ వచ్చేవాడు కాదని కౌర్ తెలిపింది. తనకు కొడుకు పుట్టిన తర్వాత కూడా తనతోపాటు ఆస్పత్రికి వచ్చేవాడు కాదని చెప్పింది. అంతేగాక, తనతో ఉండేవాడు కాదని, రాత్రుల్లో కూడా తన వద్దకు వచ్చేవాడు కాదని తెలిపింది.
మరోసారి తన చేతులను విరిచేందుకు ప్రయత్నించాడని చెప్పింది. దీంతో అతని చిత్రహింసలు భరించలేక తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. అయితే తాను రిటైరైన తన తల్లిదండ్రులకు భారంగా ఉండాల్సి వస్తోందని వాపోయింది. షలీన్ మారతాడని భావించినప్పటికీ.. అతడు తన కొడుకు షారవ్‌కు ఆహారం తీసుకొచ్చేందుకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదని తెలిపింది.
ఒక సారి తన స్నేహితురాలు తనకు ఫోన్ చేసి.. షలీన్, ఎవరో ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటుండగా చూసినట్లు చెప్పిందని తెలిపింది. దీంతో తాను షలీన్‌ను ప్రశ్నిస్తే.. అతడు తనను గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఆ తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని, మళ్లీ తిరిగి రాలేదని చెప్పింది. దీంతో తాను షలీన్‌పై కేసు పెట్టానని తెలిపింది.
కాగా, కౌర్ పెట్టిన కేసుల్లో షలీన్ ఇప్పటికే మూడు సార్లు బెయిల్ పొందాడు. తనకు న్యాయం జరగాలని, షలీన్‌కు శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు దల్జీత్ వివరించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications