విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేలకు చెమటలు పట్టించేలా తమిళగ వెట్రి కళగం (TVK) నేత ఆదవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా సర్వేల ప్రకారం.. రాష్ట్రంలో డీఎంకే కంటే తమ పార్టీ 2 శాతం అదనపు ఓట్లతో ఆధిక్యంలో ఉందని ఆయన వెల్లడించారు. చెన్నై ఆర్‌కే నగర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, విజయ్ ప్రభంజనం చూసి పాత తరం పార్టీలు వణికిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
ఆదవ్ అర్జున వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన అన్నాడీఎంకే ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఆరు నెలల క్రితం 18 శాతంగా ఉన్న టీవీకే ఓటింగ్ శాతం, సెంగోట్టయ్యన్ వంటి సీనియర్ నేతల చేరికతో ఇప్పుడు 32 శాతానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. "విజయ్ కేవలం ఆరు జిల్లాల్లో పర్యటించగానే పాలక పక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తిరువారూరు సభకు వచ్చిన జనసందోహాన్ని చూసి డీఎంకే బెంబేలెత్తిపోతోంది" అని అర్జున విమర్శించారు.

ఢిల్లీ తలొగ్గలేదు.. అందుకే ఈ కుట్రలు!
విజయ్ మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉండటం వల్లే ఢిల్లీ పెద్దలు ఆయనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆదవ్ అర్జున ఆరోపించారు. ఒకవేళ విజయ్ గనుక రాజీ పడి ఉంటే, ఎప్పుడో ఆయనను ముఖ్యమంత్రిని చేసేవారని వ్యాఖ్యానించారు. టీవీకే-బీజేపీ పొత్తుపై వస్తున్న వార్తలన్నీ డీఎంకే, అన్నాడీఎంకేలు ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆయన కొట్టిపారేశారు. "బెదిరించేవాడే పిరికివాడు.. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయేవాడే అసలైన వీరుడు" అంటూ విజయ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ఈలలు, కేకలతో మారుమోగాయి.
ఉత్తర చెన్నైని పేదరికంలోనే ఉంచారు!
గతంలో తాను డీఎంకేలో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2014 ఓటమి తర్వాత డీఎంకే కోసం కష్టపడినా తగిన గుర్తింపు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ఉత్తర చెన్నై వంటి ప్రాంతాలను కావాలనే అభివృద్ధికి దూరం చేశాయని, పేదరికాన్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని మండిపడ్డారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత డీఎంకేను ఢీకొట్టే మగాడు విజయ్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
షెడ్యూల్ విడుదలైన తొలిరోజే టీవీకే ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించడంతో, ఈసారి తమిళనాడు ఎన్నికలు 'ద్రవిడ' వర్సెస్ 'దళపతి' అన్నట్లుగా మారబోతున్నాయి.
-
విజయ్ కు బిగ్ షాక్.. -
విజయ్‌ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications