తమిళనాట విజయ్ సంచలనం, డీఎంకే ను అధిగమించి- మారుతున్న ట్రెండ్స్..!!
తమిళనాడు ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగేకొద్దీ ఆసక్తి కర ఫలితాలు వస్తున్నాయి. అధికార డీఎంకే ఆధిక్యత ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించినా ఒక్క సారిగా ట్రెండ్స్ మారుతున్నాయి. ఎన్డీఏ ఆశల పై విజయ్ నీళ్లు చల్లారు. తాజాగా అందుతున్న ట్రెండ్స్ లో డీఎంకేతో విజయ్ పోటీ పడుతున్నారు. ఒక్క సారిగా దూసుకొచ్చారు. దీంతో.. మిగిలిన రౌండ్ల పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. అన్నా డీఎంకే పలు స్థానాల్లో రెండో స్థానానికే పరిమితం అవుతోంది.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ మళ్లీ రేసులోకి వస్తున్నారు. తొలి ట్రెండ్స్ క్లియర్ గా ఉన్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే ఆధిక్యత లో కొనసాగుతోంది. అన్నా డీఎంకే రెండో స్థానంలో ఉండగా.. విజయ్ టీవీకే మూడో స్థానంలో నిలిచింది. అయితే.. ఈవీఎంలు తెరిచిన తరువాత ట్రెండ్స్ ఒక్క సారిగా మారిపోతున్నాయి. తాజా ట్రెండ్స్ మేరకు విజయ్ 63 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా.. డీఎంకే 55, అన్నా డీఎంకే కూటమి 40 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో డీఎంకే, ఎన్డీఏ ను దాటి విజయ్ ఓట్లు సొంతం చేసుకున్నారు. దీంతో.. తమిళనాట కొత్త చరిత్ర నమోదు కానుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం స్టాలిన్.. డీప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రెండు నియోజకవర్గాల్లో వెనుకజంలో ఉన్నారు. దీంతో.. రానున్న రౌండ్ల ఓట్ల లెక్కింపు పైన మరింత ఉత్కంఠ కొనసాగుతోంది.

తమిళనాడ మారుతున్న ట్రెండ్స్
ఎప్పుడూ ద్విముఖ పోరు జరిగే తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు సాగింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలే శాసిస్తుండగా.. వీటి మధ్యలోకి ఈసారి'తమిళ వెట్రి కళగం' (టీవీకే) పార్టీతో సినీనటుడు విజయ్ ప్రవేశించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించగా.. 85.10శాతం పోలింగ్ నమొదైంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకేదే ఈసారి కూడా అధికారమని మె జారిటీ ఎగ్జిట్‌పోల్ సర్వేలు ప్రకటించాయి. 'యాక్సిస్ మై ఇండియా' మాత్రం విజయ్ పార్టీ ఏకంగా 120 వరకు సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. కాగా, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశముందన్న అంచనాలతో దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. గెలిచేవారంతా వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయంలో రిపో ర్టు చేయాలని ఆదేశించారు. వారిని ఓ రిసార్టుకు తరలించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అయితే, వస్తున్న ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications