విజయ్ ను అక్కడ ఊహించని దెబ్బ కొట్టిన ఓటర్లు, అడ్రస్ గల్లంతు..!!
తమిళనాడులో విజయ్ కింగ్ అయ్యారు. దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలను చావు దెబ్బ కొట్టారు. ఊహించని విధంగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే అధికారం దక్కించుకుంటున్నారు. పూర్తి స్థాయి మెజార్టీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచారు. అయితే.. తొలి సారి పోటీ చేసిన విజయ్ తమిళనాడు లో ప్రభంజనం గా మారగా.. అక్కడ మాత్రం అడ్రస్ గల్లంతు అయింది. ఇప్పుడు ఈ లెక్కలే టీవీకే వర్గాల్లో అసలు అంతు చిక్కటం లేదు. రాజకీయంగానూ ఈ చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.
తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరీలోనూ టీవీకే పోటీ చేసింది. అక్కడ ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీయే హవా కొనసాగుతోంది. పుదుచ్చేరిలో ఉన్న 30 సీట్లలో 18 సీట్లలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది. అంటే మేజిక్ ఫిగర్ దాటిపోయింది. కాంగ్రెస్ కూటమి కేవలం 5 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎన్ఆర్ సీ, బీజేపీ కూటమి ముందంజలో ఉంది. తమిళనాడు సహా డీఎంకే పుదుచ్చేరిలో వెనుకబడింది. తమిళనాడులో విజిల్ మోత మెగించిన ఓటర్లు.. ఇక్కడ కనీసం ఆ పార్టీ వైపు చూడలేదు. ఎక్కడా తొలి నుంచి ఒక్క సీటులోనూ ఆధిక్యత కనిపించ లేదు. తమిళనాడు తరహాలోనే ఇక్కడా ఆధిపత్యం ఉంటుందని భావించినా.. ఇక్కడ ఓటర్లు మాత్రం అధికార పార్టీకే మళ్లీ పట్టం కట్టారు. ఇక్కడ డీఎంకే కు 11 సీట్లు రాగా.. టీవీకే ఒక్క సీటు దక్కించు కో లేక పోయింది .ఇదే ఇప్పుడు విజయ్ క్యాంపు లో అంతు చిక్కని అంశంగా మారుతోంది.

ఖాతా తెరువని విజయ్ పార్టీ
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు మరికొద్ది సేపట్లో తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఇక్కడ ఒకే దశలో పోలింగ్ జరిగింది. అయితే, ఈసారి రికార్డు స్థాయిలో 91.23 శాతం ఓట్లు పోలయ్యాయి. 2021 ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకుని కచ్చితమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా గెలుపును ఆశిస్తున్నది. ఈ క్రమంలో ఫలితాలపై మరికొద్ది సేపట్లో స్పష్టత రానుంది. తమిళనాడులో ఓటర్లు విజయ్ కు పట్టం కట్టగా.. సరిహద్దు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం వెనుక కారణాల పైన రాజకీయంగా చర్చ మొదలైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, విపక్ష ఇండియా (INDIA) కూటమి నామమాత్రపు స్థానాలకే పరిమితమైంది. ఈ ట్రెండ్స్ గమనిస్తే పుదుచ్చేరిలో మరోసారి ఎన్ఆర్ కాంగ్రెస్ - బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావడం లాంఛనంగానే కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications