జగన్ 2019 నినాదం, పథకాలతో బరిలోకి విజయ్- అక్కడే బిగ్ ట్విస్ట్..!!
తమిళనాట ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారింది. ఇప్పుడు అక్కడ టీవీకే విజయ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. తన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ప్రకటించారు. ఎన్నికల హామీలను కురిస్తున్నారు. రెండు ప్రధాన కూటములను టార్గెట్ చేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ .. ఆ రెండు పార్టీల పైన వ్యతిరేకత తనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. కాగా, 2019 లో జగన్ ను అధికారంలోకి తెచ్చిన నినాదం.. పథకాలే అస్త్రాలుగా ఇప్పుడు విజయ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు.
తమిళనాట విజయ్ సాధించే సీట్లు... ఓట్ల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సర్వే సంస్థలు సైతం పలు నివేదికలను విడుదల చేసాయి. ఇదే సమయంలో ఏపీలో 2019లో ఎన్నికలు ముందు వైసీపీ అధినేత జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న స్లోగన్ తో ప్రజల్లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆ స్లోగన్ బాగా పనిచేసింది. జగన్ కు జనం అవకాశం ఇచ్చారు. కాగా, ప్రస్తుతం తొలిసారిగా ఎన్నికల్లో తలపడుతున్న విజయ్ కూడా తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరుతున్నారు.. తమిళనాడులో ఇప్పటికే అనేక సార్లు తమిళ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి నన్ను గెలిపించండి. ప్రతీ కుటుంబానికి మంచి చేసి చూపిస్తాను అని విజయ్ కోరుతున్నారు. అదే విధంగా జగన్ 2019 లో ఇచ్చిన హామీలనే ఇప్పుడు విజయ్ ఫాలో అవుతున్నారు. అందులో భాగంగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు..ఉన్నత చదువుకు ఆర్దిక సాయం వంటివి ఉన్నాయి.

జగన్ తరహా సచివాలయ వ్యవస్థ పై హామీ
అదే విధంగా 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చారు. గ్రామాల్లో ప్రభుత్వం తరఫున అన్ని చేసేలా కార్యక్రమాలన్నీ వాలంటీర్ల ద్వారానే అందించారు.. ప్రస్తుతం విజయ్ కూడా వాలంటీర్ తరహా వ్యవస్థను తీసుకు వస్తామని, నియమించిన ఆ సిబ్బంది సీఎం తరపున ప్రజా సేవకులుగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం 2024 లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తు న్నారు. విజయ్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయనున్నారు. చెన్నై లోని పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే.. ఇప్పుడు జగన్ తరహా ఎన్నికల హామీలతో విజయ్ ప్రజల్లోకి వెళ్లటంతో తమిళనాడు ప్రజలు ఏ విధంగా విజయ్ కు మద్దతుగా నిలుస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
మనసు మార్చుకున్న విజయ్, లేటెస్ట్ సర్వే ఎఫెక్ట్- అనూహ్య నిర్ణయం..!! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
తెరపై స్టార్ హీరో + దర్శకుడు: విజయ్ వద్దనుకున్న చోట.. -
TN Election Survey: గెలిచేది ఆ పార్టీయేనా? జ్యోతిష్యుల షాకింగ్ జోస్యం! -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు













Click it and Unblock the Notifications